Spicy Jowar Roti : కారం జొన్న రొట్టెల‌ను త‌యారు చేయ‌డం ఇలా.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Spicy Jowar Roti : మ‌నంద‌రికీ జొన్న రొట్టెలు తెలుసు. ప్ర‌స్తుత కాలంలో ఈ జొన్న రొట్టెల‌ను తినే వారు ఎక్కువ‌వుతున్నారు. జొన్న రొట్టెల త‌యారీని ఉపాధిగా కూడా చేసుకుంటున్నారు. చిరు ధాన్యాల‌యిన‌ జొన్న‌ల‌తో చేసే ఈ రొట్టెల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ అన్నీ అందుతాయి. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఈ రొట్టెల‌ను తిన‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌ణ‌లో ఉంటుంది. వీటిని ఇండ్ల‌లో కూడా చాలా మంది త‌యారు చేస్తూ ఉంటారు. త‌ర‌చూ చేసే జొన్న రొట్టెల‌కు బ‌దులుగా వీటిలో ప‌చ్చి మిర్చిని వేసి కారం జొన్న రొట్టెల‌ను కూడా మ‌నం త‌యారు చేసుకోవ‌చ్చు. ఇవి కూడా చాలా రుచిగా ఉంటాయి. ఈ కారం జొన్న రొట్టెల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. వీటి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కారం జొన్న రొట్టెల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

జొన్న పిండి – 3 క‌ప్పులు, ప‌చ్చి మిర్చి – 10, ఉప్పు – త‌గినంత‌, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, నీళ్లు – త‌గిన‌న్ని.

Spicy Jowar Roti make in this way for better taste
Spicy Jowar Roti

కారం జొన్న రొట్టెల త‌యారీ విధానం..

ముందుగా ఒక జార్ లో లేదా రోట్లో ప‌చ్చి మిర్చిని, త‌గినంత ఉప్పును వేసి మ‌రీ మెత్త‌గా కాకుండా కొద్దిగా క‌చ్చా ప‌చ్చాగా ఉండేలా చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో జొన్న పిండిని తీసుకోవాలి. ఇందులో జీల‌క‌ర్ర తోపాటు ముందుగా త‌యారు చేసి పెట్టుకున్న ప‌చ్చి మిర్చి మిశ్ర‌మాన్ని కూడా వేసి బాగా క‌లిపిన త‌రువాత‌ కొద్ది కొద్దిగా నీళ్ల‌ను పోస్తూ చ‌పాతీ పిండిలా క‌లుపుకోవాలి. ఇలా క‌లుపుకున్న త‌రువాత మూత పెట్టి 15 నిమిషాల పాటు క‌దిలించ‌కుండా ఉంచాలి. 15 నిమిషాల త‌రువాత పిండిని మ‌రోసారి క‌లిపి కావ‌ల్సిన ప‌రిమాణంలో ముద్ద‌లుగా చేసుకోవాలి.

ఇప్పుడు పిండి ముద్ద‌ను తీసుకుని పాలిథీన్ క‌వ‌ర్ పై ఉంచి చేత్తో మ‌రీ ప‌లుచ‌గా కాకుండా కొద్దిగా మందంగా ఉండేలా వ‌త్తుకోవాలి. ఇలా వ‌త్తుకున్న రొట్టెల‌ను పెనం మీద వేసి మంట‌ను పెంచుకుంటూ, త‌గ్గిస్తూ రెండు వైపులా కాల్చుకోవాలి. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కారం జొన్న రొట్టెలు త‌యార‌వుతాయి. ఇలా త‌యారు చేసిన రొట్టెలు 6 నుండి 10 రోజుల వ‌ర‌కు నిల్వ ఉంటాయి. వీటిని నేరుగా లేదా ఎటువంటి కూర‌తో క‌లిపి తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి. త‌ర‌చూ జొన్న రొట్టెల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల ఎముక‌లు దృఢంగా ఉంటాయి. జీర్ణ‌క్రియ మెరుగుప‌డుతుంది. వీటిని తిన‌డం వ‌ల్ల బరువు కూడా త‌గ్గుతారు.

D

Recent Posts