వినోదం

Sr NTR : ఎన్టీఆర్ ఆ సినిమా కోసం ఎన్ని టేకులు తీసుకున్నారో తెలుసా.. అదే హైయెస్ట్..!

Sr NTR : తెలుగువారి గొప్ప‌ద‌నాన్ని అంత‌ర్జాతీయంగా రెప రెప‌లాడించిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్‌. న‌టుడిగా తెలుగు ప్రేక్ష‌కుడి గుండెల్లో.. నాయ‌కుడిగా తెలుగు వారి హృద‌యాల్లో ఆయ‌న వేసిన ముద్ర శాశ్వ‌తం. 295 చిత్రాల్లో ఆయ‌న పోషించ‌ని పాత్రంటూ లేదు. ప్ర‌తి పాత్ర‌కు త‌న న‌ట‌న‌తో ప్రాణం పోసిన న‌ట దిగ్గ‌జం ఎన్టీఆర్‌. ముఖ్యంగా ఎన్టీఆర్ ఏ పాత్ర వేసినా అటు నిర్మాత ఇటు డైరెక్టర్ ఇద్దరు సంతృప్తి చెందేవారు. ఒకటికి మించి ఎక్కువ టేక్ లు తీసుకుంటే ఆయన అవమానంగా ఫీల్ అయ్యే వారంట.

అంతే కాదు ఇలా చేస్తే నిర్మాతకు ఎంతో నష్టం వస్తుంది సమయం వృథా అవుతుందనీ తన తోటివారితో చెప్పేవారట. పౌరాణిక పాత్రలు నటించాల్సి వచ్చినప్పుడు సాధారణంగా ఒకటికి రెండుసార్లు తీసుకుంటారు. ఆ గెటప్ వేరుగా ఉంటుంది పదాల ఉచ్ఛరణ డబ్బింగ్ కు అనుగుణంగా ఉండాలి. పౌరాణికమైన, సాంఘికమైన ఏదైనా ఒకే ఒక్క టేకుతో చాలా అద్భుతంగా చేసేవారు ఎన్టీఆర్. ఆయనే ఆయా వేషాలు కూడా స్వయంగా వేసుకునే వారట. మేకప్ మ్యాన్ వచ్చి మనల్ని కూర్చోబెట్టి వేషం వేయాలంటే టైం వేస్ట్ తమ్ముడు.. అని ఆయనే మేకప్ వేసుకునే వారట.

sr ntr took so many takes for that movie

ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎన్టీఆర్ ఒక వేషం చేయాల్సి వచ్చినప్పుడు ఏకంగా 6, 7 టేకులు తీసుకున్నారట. గుమ్మడి రాసుకున్న పుస్తకంలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. నర్తనశాల సినిమాలో ఎన్టీఆర్ కృష్ణుడిగా, అర్జునుడుగా నటించారు. ఈ 2 వేషాలు వేయాల్సి వచ్చినప్పుడు ఆయన ఇబ్బంది పడలేదు. కానీ బృహన్నలగా ఆయన వేషం వేసినప్పుడు పూర్తిగా నడక ఆహార్యం మారిపోతాయి. దీనిని సూట్ చేయాల్సిన సమయంలో మాత్రం అన్నగారు ఒకటికి రెండు సార్లు చెక్ తీసుకుని జాగ్రత్తగా చేశారని గుమ్మడి పేర్కొన్నారు. అన్నగారి జాగ్రత్తలే ఆ పాత్రకు జీవం పోశాయి అని ఆయన రాసుకొచ్చారు.

Admin

Recent Posts