Sreemukhi : డీజే టిల్లు పాట‌కు శ్రీ‌ముఖి డ్యాన్స్‌.. ఇర‌గ‌దీసిందిగా..!

Sreemukhi : ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఎక్క‌డ చూసినా ప‌లు పాట‌ల‌కు కొంద‌రు చేస్తున్న డ్యాన్స్‌లు వైర‌ల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ న‌టించిన పుష్ప సినిమాలోని శ్రీ‌వ‌ల్లి పాట‌తోపాటు ర‌ష్మిక మందన్న చేసిన సామి సాంగ్ డ్యాన్స్‌లు వైర‌ల్ అయ్యాయి. ఇక ఇటీవ‌లే మ‌హేష్ బాబు స‌ర్కారు వారి పాట చిత్రం నుంచి క‌ళావ‌తి సాంగ్ విడుద‌ల కాగా.. అందులోని స్టెప్స్‌ను చాలా మంది వేస్తున్నారు.

Sreemukhi danced for DJ Tillu movie title song
Sreemukhi

ఇక సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌, నేహాశెట్టిలు హీరో హీరోయిన్లుగా న‌టించిన లేటెస్ట్ మూవీ డీజే టిల్లు. ఇందులోని టైటిల్ సాంగ్ ప్ర‌స్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నంబ‌ర్ 2 స్థానంలో కొన‌సాగుతోంది. ఈ పాట ఎంతో మందిని ఆక‌ట్టుకుంటోంది. అందులో భాగంగానే యాంక‌ర్ శ్రీ‌ముఖి ఈ పాట‌కు తాజాగా స్టెప్పులేసింది. ఆమె ఈ పాట‌కు డ్యాన్స్ ఇర‌గ‌దీసింద‌నే చెప్ప‌వ‌చ్చు.

డీజే టిల్లు మూవీ కూడా బాక్సాఫీస్ వ‌ద్ద బంప‌ర్ హిట్ సాధించింది. అందులోని టైటిల్ సాంగ్‌కు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ ర‌థం ప‌డుతున్నారు. ఆ సాంగ్ చాలా మందిని అల‌రిస్తోంది. అందులో అద్భుత‌మైన డ్యాన్స్ స్టెప్స్ ఉండ‌డంతో చాలా మంది ఆ పాట‌కు డ్యాన్స్‌లు చేస్తున్నారు. ఇక శ్రీ‌ముఖి కూడా డ్యాన్స్ చేయ‌గా.. ఆమె వీడియో వైర‌ల్‌గా మారింది.

Editor

Recent Posts