Sri Reddy : పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానాలు ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం.. భీమ్లా నాయక్. ఈ సినిమా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే సినిమాకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిందని అంటున్నారు. ఇక విమర్శకుల నుంచి కూడా ఈ సినిమాకు ప్రశంసలు లభిస్తున్నాయి. అయితే ఎల్లప్పుడూ పవన్ కల్యాణ్ అనే శత్రువుగా చూసే శ్రీరెడ్డి మాత్రం భీమ్లా నాయక్ పై నిప్పులు కురిపించింది. పవన్ కల్యాణ్‌ను అరేయ్.. అంటూ తిట్టింది. ఈ క్రమంలోనే శ్రీరెడ్డి తిట్టిన ఆ వీడియో వైరల్‌గా మారింది.
ఏంట్రా పీకే.. సినిమా తీశావంట.. దొబ్బంది కదా.. నువ్వు సినిమాలకు, రాజకీయాలకు పనికిరావు.. రెండో రోజు నీ సినిమాను చూసేవాళ్లు కరువయ్యారు.. అంటూ శ్రీరెడ్డి.. పవన్ కల్యాణ్‌ను దుర్భాషలాడింది. భీమ్లా నాయక్ సినిమా చాలా చెత్తగా ఉందని.. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈ సినిమాను తీశావు.. అంటూ ఫైర్ అయింది.
ఇక నీ సినిమా కోసం నువ్వు తెలంగాణ మంత్రి కేటీఆర్ సంక ఎందుకు నాకావు.. కేటీఆర్‌ను, తెలంగాణ ప్రభుత్వాన్ని కలవచ్చు.. కానీ చిరంజీవి మాత్రం సీఎం జగన్‌ను కలవకూడదా ? అంటూ ప్రశ్నించింది. నువ్వు ఎన్ని నాటకాలు ఆడనా.. సీఎంవి కాలేవు.. అంటూ శ్రీరెడ్డి విమర్శించింది. పవన్‌ను ఇష్టం వచ్చినట్లు తిట్టి పారేసింది.
కాగా పవన్‌ను శ్రీరెడ్డి తిట్టడంపై ఆయన అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. శ్రీరెడ్డిపై మండిపడుతున్నారు. అయితే వాస్తవానికి భీమ్లా నాయక్ సినిమా రిలీజ్‌కు ముందే చాలా బిజినెస్ చేసింది. అలాగే బాక్సాఫీస్ వద్ద కూడా మంచి టాక్‌ను సాధించిందనే చెప్పవచ్చు.