Standup Rahul : రాజ్ తరుణ్ తెలుగు వెండి తెరకు ఉయ్యాల జంపాల అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. తన నటనతో ప్రేక్షకుల ప్రశంసలను అందుకున్నాడు. భిన్న రకాల పాత్రలు చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో ఇతను నటిస్తున్న అన్ని చిత్రాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా స్టాండప్ రాహుల్ అనే చిత్రంతో రాజ్ తరుణ్ మరోమారు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
రాజ్ తరుణ్ హీరోగా నటించిన తాజా చిత్రం స్టాండప్ రాహుల్. సాంటో ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. థియేటర్లలో హోళి సందర్భంగా ఈ సినిమాను విడుదల చేశారు. కామెడీ, లవ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రాజ్ తరుణ్ స్టాండప్ కామెడియన్ పాత్రలో నటించాడు. మంచి టాక్ ను ఈ సినిమా సొంతం చేసుకుంది.
ఇక థియేలర్‌లలో విడుదలైన ప్రతి సినిమా ఓటీటీలో కూడా విడుదలై ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. కాగా స్టాండప్ రాహుల్ సినిమాను కూడా ఓటీటీలో విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఆహా సొంతం చేసుకుంది. ఈ సినిమాను నాలుగు వారాల తరువాత లేదా అంత కంటే ముందే ఆహా స్ట్రీమింగ్ చేయనుంది. అందువల్ల ఈ సినిమా ఏప్రిల్ మొదటి వారంలో ఓటీటీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ఇక స్టాండప్ రాహుల్ త్వరలో తెలుగు ప్లాట్ ఫామ్ ఆహాలో రానుంది. ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన వర్ష బొల్లం హీరోయిన్ గా నటించింది. వెన్నెల కిషోర్, ఇంద్రజ, మురళీ శర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.