Sweet Corn Pulao : ఎంతో రుచిక‌ర‌మైన స్వీట్ కార్న్ పులావ్‌.. త‌యారీ ఇలా..!

Sweet Corn Pulao : స్వీట్ కార్న్ అంటే స‌హ‌జంగానే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. దీన్ని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. దీన్ని ఉడ‌క‌బెట్టుకుని తింటే వ‌చ్చే మ‌జాయే వేరు. అలాగే వీటితో ప‌లు ఇతర వంట‌కాల‌ను కూడా చేస్తుంటారు. స్వీట్ కార్న్‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే పులావ్‌ను కూడా త‌యారు చేయ‌వ‌చ్చు. కాస్త శ్ర‌మించాలే కానీ రుచిక‌ర‌మైన స్వీట్ కార్న్ పులావ్ నిమిషాల్లో రెడీ అవుతుంది. దీన్ని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Sweet Corn Pulao very tasty make in this method
Sweet Corn Pulao

స్వీట్ కార్న్ పులావ్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బాస్మతి రైస్ – 1 కప్పు, నీళ్ళు – ఒక‌టిన్న‌ర‌ కప్పు, స్వీట్ కార్న్ – 1 కప్పు, బఠాణీలు – 1 కప్పు, ఉల్లి పాయ – 1, అల్లం – చిన్న ముక్క, పచ్చి మిర్చి – 1, వెల్లుల్లి రెబ్బలు – 4, నూనె – 2 స్పూన్లు, గరం మసాలా – పావు టీస్పూన్, జీలకర్ర, పసుపు, ఉప్పు, కారం, నిమ్మరసం – కొద్దిగా, యాలకులు – 2, లవంగాలు, దాల్చిన చెక్క, పుదీనా, బిర్యానీ ఆకులు – 2.

స్వీట్ కార్న్ పులావ్ ను త‌యారు చేసే విధానం..

ఉల్లిపాయ, అల్లం, పుదీనా, పచ్చిమిర్చి, వెల్లుల్లిల‌ను కలిపి మెత్తగా పేస్ట్ చేయాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేసి జీలకర్ర, లవంగాలు, బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ పేస్ట్ ని వేసి అందులోనే కారం, పసుపు, గరం మసాలా వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత స్వీట్ కార్న్, బఠాణీలు వేసి దోరగా వేయించాలి. అందులోనే బియ్యానికి సరిపడా నీళ్ళు పోసి తగినంత ఉప్పు, నాన బెట్టిన రైస్ వేసి ఉడికించాలి. చివర‌గా నిమ్మరసం పిండి సర్వ్ చేస్తే ఎంతో రుచికరమైన స్వీట్ కార్న్ పులావ్ రెడీ అవుతుంది. దీన్ని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. దీన్ని నేరుగా అలాగే తిన‌వ‌చ్చు.

Editor

Recent Posts