Holy Basil Seeds : హిందూ సంప్రదాయంలో తులసి మొక్కను పూజించడం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తోంది. తులసి మొక్కను ఇంట్లో పెట్టుకుని పూజలు చేయడం వల్ల అంతా మంచే జరుగుతుందని.. ఇంట్లోని వారికి సుఖశాంతులు కలుగుతాయని నమ్ముతారు. అందుకనే మహిళలు తులసి మొక్కకు రోజూ పూజలు చేస్తుంటారు. ఇక ఆయుర్వేద పరంగా కూడా తులసి మొక్క ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. దీన్ని అనేక ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. అయితే కేవలం తులసి మొక్క ఆకులు మాత్రమే కాదు.. తులసి విత్తనాలు కూడా మనకు లభిస్తాయి. ఇవి కూడా ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. తులసి విత్తనాల వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
తులసి విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కనుక ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో వ్యాధులు, ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. బాక్టీరియా, వైరస్‌ల నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే క్యాన్సర్ కణాలు పెరగకుండా అడ్డుకోవచ్చు. దీంతో క్యాన్సర్లు రావు. అలాగే తులసి విత్తనాల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. ముఖ్యంగా గ్యాస్, అసిడిటీ, మలబద్దకం తగ్గుతాయి. అలాగే తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. ఇక ఈ ఫైబర్ శరీరంలోని కొవ్వును కూడా కరిగిస్తుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు. ఇక తులసి విత్తనాలను తినడం వల్ల రక్తనాళాల్లో ఉండే కొవ్వు కరుగుతుంది. దీంతో రక్తనాళాలు శుభ్రంగా మారుతాయి. ఫలితంగా హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. అలాగే గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
తులసి విత్తనాలను రోజూ తినడం వల్ల హార్ట్ ఎటాక్‌లు వచ్చే అవకాశాలు చాలా వరకు తక్కువగా ఉంటాయని సైంటిస్టులు చేసిన పరిశోధనల్లో వెల్లడైంది. అలాగే ఈ విత్తనాల్లో ఉండే పొటాషియం రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో హైబీపీ తగ్గుతుంది. ఈ విత్తనాలు హైబీపీ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తాయి. ఇక వయస్సు మీద పడడం వల్ల ఎవరి చర్మం అయినా సరే ముడతలు పడి సాగుతుంది. కానీ తులసి విత్తనాలు తింటే చర్మం ముడతలు పడదు. దీంతో ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు. ఇక ఈ విత్తనాల్లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది కంటి సమస్యలను తగ్గిస్తుంది. కళ్లలో శుక్లాలు ఏర్పడకుండా చూస్తుంది. కంటి చూపును పెంచుతుంది. దీంతో కళ్లద్దాలను వాడాల్సిన పని ఉండదు. అలాగే తులసి విత్తనాల్లో ఉండే ఐరన్ శరీరంలో రక్తం బాగా తయారయ్యేలా చేస్తుంది. దీంతో రక్తహీనత నుంచి బయట పడవచ్చు. అలాగే జుట్టుకు పోషణ లభిస్తుంది. దీంతో వెంట్రుకలు రాలిపోకుండా ఉంటాయి. శిరోజాలు దృఢంగా, ఒత్తుగా పెరుగుతాయి. కనుక ఇన్ని లాభాలు ఉన్న తులసి విత్తనాలను అసలు మిస్ చేసుకోకుండా రోజూ తినండి. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు.