వినోదం

Tagore And Yogi : ఠాగూర్‌, యోగి.. రెండూ రీమేక్‌లే.. ఒక‌టి హిట్‌.. ఒక‌టి ఫ్లాప్‌.. ఎందుక‌లా..?

Tagore And Yogi : వివి వినాయ‌క్.. ఈ పేరుకి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. మాస్ స్పెష‌లిస్ట్‌గా పేరు తెచ్చుకున్న వినాయ‌క్ టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్నారు. గ‌త కొంత కాలంగా వినాయక్ చేతిలో ఒక్క మంచి హిట్ సినిమా కూడా లేదు. మెగాస్టార్ కమ్‌ బ్యాక్ సినిమా పుణ్యమా అని ఖైదీ నెంబర్ 150 తో మంచి హిట్ అందుకున్న వినాయక్ ఆ తరువాత దర్శకత్వాన్ని వదిలేసి కొన్నాళ్లు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ప్రయత్నాలు అయితే చేశాడు. సీనయ్య అనే ఒక సినిమా పట్టాలెక్కింది కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఆ సినిమా వెలుగులోకి రాలేదు.

ఆయ‌న హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో ఛత్రపతి హిందీ రీమేక్ డైరెక్ట్ చేశారు. కానీ ఈ మూవీ అనుకున్నంత‌గా రాణించ‌లేదు. రీమేక్ స్పెష‌లిస్ట్‌గా నిలిచిన వినాయ‌క్ ఓ సినిమాలో మార్పు చేసి బ్లాక్ బ‌స్ట‌ర్ కొడితే మ‌రో సినిమాలో ఉన్న‌ది ఉన్న‌ట్టుగా చేసి ఫ్లాప్ అందుకున్నాడు. ప్ర‌భాస్ హీరోగా వివి వినాయ‌క్ ద‌ర్శ‌క‌తంలో యోగి సినిమా రాగా, ఈ సినిమా ప్ర‌భాస్ అభిమానుల‌కి చాలానే న‌చ్చింది. అయితే క‌మర్షియ‌ల్‌గా చూసుకుంటే మాత్రం ఈ సినిమా సూప‌ర్ హిట్ అవ్వ‌లేక‌పోయింది.

Tagore And Yogi one is hit and one is flop why

అయితే ఈ సినిమాను రీమేక్ చేసిన‌ప్పుడు ఒరిజిన‌ల్ వ‌ర్ష‌న్ లో త‌ల్లి చ‌నిపోతుంద‌ట‌. ఆ సీన్ ను అలానే ఉంచ‌డంతో సినిమాకు నెగెటివ్ టాక్ వ‌చ్చింది. ఠాగూర్ అనే చిత్రాన్ని కూడా వినాయ‌క్ తెర‌కెక్కించ‌గా ఒరిజిన‌ల్ లో హీరో క్లైమాక్స్ లో చ‌నిపోతాడు. కానీ తెలుగు ఠాగూర్ లో హీరో బ్ర‌తికి ఉంటాడు. హీరో చ‌నిపోక‌పోవ‌డం వ‌ల్లే ఠాగూర్ సూప‌ర్ హిట్ అయింద‌ని చెప్ప‌వ‌చ్చు.

Admin

Recent Posts