వినోదం

Sangeetha Krish : హీరోయిన్ సంగీత భ‌ర్త కూడా సినిమా ఇండ‌స్ట్రీకి చెందిన వ్య‌క్తి అని మీకు తెలుసా..?

Sangeetha Krish : తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు దోచుకున్న అందాల ముద్దుగుమ్మ సంగీత‌. నిజానికి ఈమె తమిళమ్మాయే అయినప్పటికీ తెలుగు సినిమాలతోనే ఎక్కువగా పాపులారిటీని సొంతం చేసుకొని తెలుగు ప్ర‌జ‌ల మ‌న‌సులు గెలుచుకుంది. తెలుగు, తమిళం, కన్నడం, మళ‌యాళం భాషల్లో సినిమాలు చేసిన సంగీత 65కి పైగా సినిమాల్లో నటించిందన్న సంగతి బహుశా ఎక్కువ మందికి తెలిసుండదు. కృష్ణవంశీ దర్శకత్వంలో చేసిన ఖడ్గం చిత్రం ఈమెకు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అంటూ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది.

ప్ర‌స్తుతం ఈమె బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న ప‌లు షోల‌కు జ‌డ్జిగా పాల్గొంటోంది. ఇటీవ‌ల ఓ షోలో ఆస‌క్తిక‌ర విషయాలు పంచుకుంది. చిన్న‌త‌నం నుంచి చాలా లావుగా ఉండేదాన్ని నాకు కొన్ని చ‌ర్మ స‌మ‌స్య‌లు కూడా ఉండేది. ముఖ్యంగా బంగారు న‌గ‌ల‌ను ధ‌రిస్తే అల‌ర్జీ వ‌చ్చేసేది. ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కొత్త‌లో హీరోయిన్‌గా ప‌నికి రాన‌ని చాలా మంది అవ‌మానించారు. దాంతో హీరోయిన్ గా చేయ‌న‌ని మా అమ్మ‌తో చెప్పేసి సినిమాలు మానేద్దామ‌నుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది.

do you know that actress sangeetha husband is a singer

సంగీత క్రిష్ అనే వ్య‌క్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2009 లో సింగ‌ర్ క్రిష్ ను వివాహం చేసుకోగా, క్రిష్ తమిళ్ లో ఎన్నో సూప‌ర్ హిట్ సాంగ్స్ ను పాడారు. సింగ‌ర్ గా త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ధ‌నుష్ సాంగ్స్ లో సూప‌ర్ హిట్ సాంగ్ రౌడీ బేబీ పాట‌ను క్రిష్ పాడారు. వీరిద్ద‌రికీ షివియా అనే పాప కూడా ఉంది. మ‌హేశ్ బాబు హీరోగా న‌టించిన స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాలో స్వ‌రాజ్యం అనే పాత్ర‌లో న‌టించి త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. ఆచార్య, ఎఫ్3 సినిమాల్లో కూడా న‌టించి అల‌రించింది.

Admin

Recent Posts