Telangana Style Pappu Charu : తెలంగాణ స్టైల్‌లో ప‌ప్పు చారును ఇలా చేయండి.. గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు..!

Telangana Style Pappu Charu : మ‌న‌కు తెలంగాణా దావ‌త్ ల‌లో, ఫంక్ష‌న్ ల‌ల్లో క‌నిపించే వంట‌కాల్లో ప‌ప్పు, ప‌చ్చి పులుసు కూడా ఒక‌టి. ప‌ప్పు, ప‌చ్చి పులుసు రెండింటిని క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. పప్పు, ప‌చ్చిపులుసు ఉండ‌ని తెలంగాణా ఫంక్ష‌న్ ఉండ‌ద‌నే చెప్ప‌వ‌చ్చు. ఈ పప్పు, ప‌చ్చిపులుసును మ‌నం కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు వీటిని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఎవ‌రైనా వీటిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో క‌మ్మ‌గా, తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే ఈ ప‌ప్పు, ప‌చ్చి పులుసును ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివరాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

తెలంగాణా ప‌ప్పుచారు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నాన‌బెట్టిన కందిప‌ప్పు – ఒక క‌ప్పు, నీళ్లు – ఒక‌టిన్న‌ర క‌ప్పు, ప‌సుపు – కొద్దిగా, ప‌చ్చిమిర్చి – 12 లేదా త‌గిన‌న్ని, వెల్లుల్లి రెబ్బ‌లు – 8, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, నూనె – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 1, దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 5, క‌రివేపాకు – ఒక రెమ్మ‌.

Telangana Style Pappu Charu recipe in telugu make in this method
Telangana Style Pappu Charu

ప‌చ్చి పులుసు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నాన‌బెట్టిన చింత‌పండు – పెద్ద నిమ్మ‌కాయంత‌, నీళ్లు – త‌గిన‌న్ని, స‌న్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – పావు టీ స్పూన్,త‌రిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్, నూనె – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 4, క‌రివేపాకు – ఒక రెమ్మ‌.

తెలంగాణా ప‌ప్పుచారు త‌యారీ విధానం..

ముందుగా ప‌ప్పును కుక్క‌ర్ లో వేసి ప‌సుపు, నూనె, నీళ్లు పోసి మూత పెట్టి 3 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత జార్ లో ప‌చ్చిమిర్చి, జీల‌క‌ర్ర‌, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి బ‌ర‌క‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత కుక్క‌ర్ మూత తీసి ప‌ప్పును మెత్త‌గా చేసుకోవాలి. త‌రువాత ఉప్పు, మిక్సీ ప‌ట్టుకున్న ప‌చ్చిమిర్చి పేస్ట్, 200 ఎమ్ ఎల్ నీళ్లు పోసి క‌ల‌పాలి. ఇప్పుడు ఈ కుక్క‌ర్ ను మ‌ర‌లా స్ట‌వ్ మీద ఉంచి 5 నుండి 6 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత తాళింపుకు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత జీల‌క‌ర్ర‌, ఆవాలు, వెల్లుల్లి రెబ్బ‌లు, క‌రివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించాలి. త‌రువాత తాళింపును ప‌ప్పులో వేసి క‌ల‌పాలి. ఇలా చేయ‌డం వల్ల ప‌ప్పు త‌యార‌వుతుంది. ఇప్పుడు ఇందులోకి ప‌చ్చి పులుసును ఎలా త‌యారు చేసుకోవాలో తెలుసుకుందాం.

దీని కోసం ఒక గిన్నెలో చింత‌పండు ర‌సాన్ని తీసుకోవాలి. త‌రువాత ఇందులో త‌గిన‌న్ని నీళ్లు, ఉల్లిపాయ ముక్క‌లు, ఉప్పు, ప‌చ్చిమిర్చి, కొత్తిమీర వేసి ముక్క‌ల‌ను చేత్తో క‌లుపుతూ బాగా క‌లుపుకోవాలి. త‌రువాత తాళింపుకు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత ఆవాలు, జీల‌క‌ర్ర‌, వెల్లుల్లి రెబ్బ‌లు, క‌రివేపాకు వేసి తాళింపు చేసుకోవాలి. ఈ తాళింపును ప‌చ్చి పులుసులో వేసి క‌ల‌పాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ప‌చ్చి పులుసు త‌యార‌వుతుంది. ఇలా చేయ‌డం వ‌ల్ల ప‌ప్పు, ప‌చ్చి పులుసు త‌యార‌వుతుంది. ఇలా త‌యారు చేసిన ప‌ప్పు, ప‌చ్చిపులుసును అన్నంలో వేసి క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.

D

Recent Posts