Dengue Diet : డెంగ్యూ నుంచి త్వ‌ర‌గా కోలుకోవాలంటే.. ఈ 6 ఆహారాల‌ను తీసుకోవాలి..!

Dengue Diet : దోమ‌ల ద్వారా వ‌చ్చే విష జ్వరాల్లో డెంగ్యూ జ్వ‌రం కూడా ఒక‌టి. ఈ జ్వ‌రం కార‌ణంగా మ‌నం తీవ్ర అనారోగ్యానికి గురి కావాల్సి వ‌స్తుంది. ర‌క్తంలో ఎర్ర ర‌క్త‌క‌ణాల సంఖ్య త‌గ్గ‌డంతో పాటు హిమోగ్లోబిన్ స్థాయిలు కూడా త‌గ్గి ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌లెత్తుతుంది. ఈ జ్వ‌రం బారిన ప‌డిన‌ప్పుడు మ‌నం ఎంత జాగ్ర‌త్త‌గా ఉంటామో జ్వ‌రం త‌గ్గిన త‌రువాత కూడా అంతే జాగ్ర‌త్త‌గా ఉండాలి. ముఖ్యంగా ర‌క్త‌హీన‌త స‌మ‌స్య లేకుండా చూసుకోవాలి. చాలా మంది డెంగ్యూ జ్వ‌రం బారిన ప‌డితే హిమోగ్లోబిన్ స్థాయిలు ఎందుకు త‌గ్గుతాయని భావిస్తూ ఉంటారు. కానీ డెంగ్యూ జ్వ‌రానికి ర‌క్తంలో హిమోగ్లోబిన్ స్థాయిల‌కు సంబంధం ఉంది. ఎర్ర ర‌క్త‌క‌ణాల్లో ఉండే ప్రోటీనే హిమోగ్లోబిన్. ఇది శ‌రీర క‌ణాజాలాల‌కు ఆక్సిజ‌న్ ను స‌ర‌ఫ‌రా చేస్తుంది.

డెంగ్యూ జ్వ‌రం కార‌ణంగా శ‌రీరంలో ఎర్ర రక్త‌క‌ణాల సంఖ్య త‌గ్గుతుందని మ‌నంద‌రికి తెలిసిందే. దీంతో ర‌క్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు కూడా తగ్గుతాయి. దీనినే ర‌క్త‌హీన‌త అని కూడా అంటారు. డెంగ్యూ జ్వ‌రంతో బాధ‌ప‌డే వారిలో ఈ ర‌క్త‌హీన‌త స‌మస్య కొంద‌రిలో ఎక్కువ‌గాఉంటే కొంద‌రిలో త‌క్కువ‌గా ఉంటుంది. అయితే స‌మ‌స్య ఎక్కువ‌గా ఉంటే మాత్రం ర‌క్తాన్ని ఎక్కించాల్సి ఉంటుంది. క‌నుక డెంగ్యూజ్వ‌రం నుండి కోలుకున్న వారు ర‌క్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు త‌గ్గ‌కుండా చూసుకోవాలి. దీని కోసం వారు ఐర‌న్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి. ఐర‌న్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఎర్ర ర‌క్త‌క‌ణాలు ఎక్కువ‌గా త‌యార‌వుతాయి. రక్త‌హీన‌త స‌మ‌స్య తగ్గుతుంది. మాంసం, గుడ్లు, పాలు మ‌రియుపాల ఉత్ప‌త్తులు, చేప‌లు, కాయ‌గూర‌లు, ఆకుకూర‌లు వంటి వాటిని తీసుకోవాలి.

Dengue Diet in telugu take these 6 foods for faster recovery
Dengue Diet

అలాగే మ‌నం తీసుకునే ఆహారంలో ఉండే ఐర‌న్ ను మ‌న శరీరం గ్ర‌హించాలంటే మ‌న శ‌రీరంలో త‌గినంత విట‌మిన్ సి ఉండేలా చూసుకోవాలి. విట‌మిన్ సి త‌గినంత ఉండేనే మ‌నం తీసుకునే ఆహారంలో ఉండే ఐర‌న్ ను మ‌న శ‌రీరం గ్ర‌హిస్తుంది. అలాగే విట‌మిన్ సి ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. నిమ్మ‌జాతికి చెందిన పండ్ల‌ను, ట‌మాటాల‌ను, బెర్రీల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి. అలాగే ఎర్ర ర‌క్త‌క‌ణాలు మ‌రియు తెల్ల‌ర‌క్త‌క‌ణాల అభివృద్దిలో మ‌న‌కు ఫోలెట్ కూడా ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. అంతేకాకుండా శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో కూడా ఫోలెట్ మ‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంది. ఆకుకూర‌లు, తృణ‌ధాన్యాలు, బీన్స్, కాయ‌ధాన్యాలు వంటి వాటిని తీసుకోవ‌డంవ‌ల్ల శ‌రీరానికి త‌గినంత ఫోలెట్ ల‌భిస్తుంది.

అదేవిధంగా న్యూర‌నాల్ ప‌ని తీరులో, ఎర్ర ర‌క్త‌క‌ణాలు ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అయ్యేలా చేయ‌డంలో విట‌మిన్ బి 12 కూడా మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. గుడ్లు, పాలు, పాల ఉత్ప‌త్తులు, మాంసం వంటి వాటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి త‌గినంత విట‌మిన్ బి 12 ల‌భిస్తుంది. అంతేకాకుండా డెంగ్యూ జ్వ‌రం నుండి కోలుకున్న వారు ప్రోటీన్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి. ఈ విధమైన ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల డెంగ్యూ జ్వ‌రం వ‌ల్ల త‌లెత్తే ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌గ్గడంతో పాటు మ‌రింత త్వ‌ర‌గా కోలుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts