Tender Coconut Milk Shake : లేత కొబ్బ‌రితో మిల్క్ షేక్‌ను ఇలా చేయండి.. రుచి సూప‌ర్‌గా ఉంటుంది..!

Tender Coconut Milk Shake : కొబ్బ‌రి బోండాల్లో ఉండే లేత కొబ్బరి ఎంత రుచిగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. చాలా మంది ఈ లేత కొబ్బ‌రిని ఇష్టంగా తింటారు. దీనిని తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. ఈ లేత కొబ్బ‌రిని కొంద‌రు నేరుగా తింటే మ‌రికొంద‌రు పంచ‌దార‌తో క‌లిపి తింటూ ఉంటారు. ఇలా తీసుకోవ‌డంతో పాటు లేత కొబ్బ‌రితో మ‌నం ఎంతో రుచిగా ఉండే మిల్క్ షేక్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఒక్క‌సారి ఈ మిల్క్ షేక్ రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాల‌ని అడ‌గ‌క మాన‌రు. ఎంతో రుచిగా ఉండే లేత కొబ్బ‌రితో మ‌రింత రుచిగా మిల్క్ షేక్ ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

టెండర్ కొకోన‌ట్ మిల్క్ షేక్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చ‌ల్ల‌టి పాలు – అర‌గ్లాస్, కొబ్బ‌రి నీళ్లు – ఒక గ్లాస్, పంచ‌దార – ఒక క‌ప్పు, లేత కొబ్బ‌రి – ఒక కప్పు.

Tender Coconut Milk Shake recipe in telugu very tasty easy to prepare
Tender Coconut Milk Shake

టెండర్ కొకోన‌ట్ మిల్క్ షేక్ త‌యారీ విధానం..

ముందుగా ఒక జార్ లో పంచ‌దార‌, కొబ్బ‌రి ముక్క‌లు తీసుకుని మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత పాలు, కొబ్బ‌రి నీళ్లు పోసి 5 నిమిషాల పాటు మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఈ మిల్క్ షేక్ ను గ్లాస్ లో పోసుకుని స‌ర్వ్ చేసుకోవాలి. చ‌ల్ల‌గా కావాల‌నుకునే వారు ఐస్ క్యూబ్స్ వేసుకోవ‌చ్చు. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే టెండ‌ర్ కొకోన‌ట్ మిల్క్ షేక్ త‌యార‌వుతుంది. దీనిని తాగ‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. ఈ మిల్క్ షేక్ ను పిల్ల‌లు మ‌రింత ఇష్టంగా తాగుతారు.

D

Recent Posts