Thaman : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, కీర్తి సురేష్ హీరయిన్‌గా తెరకెక్కుతున్న చిత్రం.. సర్కారు వారి పాట. ఈ మూవీ మే 12వ తేదీన విడుదలవుతోంది. కాగా ఈ మూవీకి చెందిన మొదటి సాంగ్ కళావతికి చెందిన ప్రోమోను చిత్ర యూనిట్ యూట్యూబ్‌లో తాజాగా విడుదల చేసింది. దీంతో ఆ ప్రోమో ట్రెండింగ్ గా మారింది. అయితే ఈ సాంగ్‌ను వాలెంటైన్స్ డే రోజున చిత్ర యూనిట్ ప్రత్యేకంగా విడుదల చేద్దామనుకుంది. కానీ చిత్ర యూనిట్‌కు చెందిన కొందరు ఈ సాంగ్‌ను ఇంటర్నెట్‌లో లీక్ చేశారు. ఈ క్రమంలో మేకర్స్ ఒక్కసారిగా షాకయ్యారు.
సర్కారు వారి పాట సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. ఈ సాంగ్ మొత్తం లీకైందని తెలుసుకుని థమన్ సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టాడు. అందులో ఆయనకు ఏడుపు ఒక్కటే తక్కువైంది అన్నట్లు కనిపించారు. తీవ్రంగా బాధలో ఉన్నట్లు స్పష్టమైంది. ఈ సందర్భంగా థమన్ మాట్లాడుతూ.. 1000 మంది కష్టాన్ని ఒకేసారి బుగ్గిపాలు చేశారని.. తన మ్యూజిక్ బృందంలో ఉన్న కొందరు ఈ విధంగా చేయడం తనకు తీవ్రంగా బాధను కలిగిస్తుందని అన్నారు.
ఇక కళావతి సాంగ్‌ను ఆదివారం లాంచ్ చేయనున్నారు. ఈ సాంగ్‌ను వాస్తవానికి వాలెంటైన్స్ డే రోజున రిలీజ్ చేయాల్సి ఉంది. ప్రత్యేకంగా ఆ రోజు ఈ పాటను లాంచ్ చేద్దామనుకున్నారు. కానీ మేకర్స్ ప్లాన్ మొత్తం చెలాచెదురు అయింది. ఇక మిగిలిన పాటలను కూడా ప్రత్యేకంగా లాంచ్ చేద్దామనుకుంటున్నారు. మరి ఏమవుతుందో చూడాలి.
అయితే ఈ సాంగ్‌ను లీక్ చేసిన ఇద్దరిని ఇప్పటికే జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోకు మరింత సెక్యూరిటీని పెంచినట్లు మేకర్స్ తెలియజేశారు.