Laptops : ల్యాప్‌టాప్‌లు అనేవి ప్రస్తుత తరుణంలో కామన్ అయిపోయాయి. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు వాటిని ఒక నిత్యావసర వస్తువుగా వాడుతున్నారు. కరోనా వచ్చాక చాలా మందికి ల్యాప్‌టాప్‌ల అవసరం ఏర్పడింది. అయితే మార్కెట్‌లో మంచి ఫీచర్స్ కలిగి, ధర తక్కువగా ఉండే ల్యాప్‌టాప్‌ల గురించి వెదకడం చాలా కష్టమవుతోంది. అలాంటి వారి కోసమే ఈ వివరాలను అందజేయడం జరుగుతుంది. కింద తెలిపిన ల్యాప్‌టాప్‌లు మంచి ఫీచర్స్‌ను కలిగి ఉండడమే కాదు.. బడ్జెట్ ధరలో వస్తాయి. మరి వాటి వివరాలను తెలుసుకుందామా..!
1. అవిటా ఎసెన్షియా – ఇందులో 14 ఇంచుల డిస్‌ప్లే, విండోస్ 10, ఎస్‌ఎస్‌డీ డ్రైవ్, 6 గంటల వరకు బ్యాకప్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ధర అమెజాన్‌లో రూ.24,589 వరకు ఉంది.
2. హెచ్‌పీ 14 (2021) 11వ జెన్ ఇంటెల్ కోర్ ఐ3 ల్యాప్‌టాప్ – ఇందులో ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్ ఉంది. విండోస్ 11, 14 ఇంచుల డిస్‌ప్లే లభిస్తాయి. దీని ధర రూ.40వేల వరకు ఉంది.
3. లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3 – ఇందులో 14 ఇంచుల డిస్‌ప్లే, ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్, ఎన్‌వీడియా గ్రాఫిక్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ధర రూ.35వేలు ఉంది.
4. హెచ్‌పీ క్రోమ్ బుక్ 14 ఇంచ్ ల్యాప్‌టాప్ – ఇందులో 14 ఇంచుల డిస్‌ప్లే, ఇంటెల్ ప్రాసెసర్, 12 గంటల బ్యాటరీ బ్యాకప్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ధర రూ.27,490 గా ఉంది.
5. అసుస్ వివోబుక్ 15 (2020) – ఇందులో ఇంటెల్ కోర్ ప్రాసెసర్, ఎన్‌వీడియా గ్రాఫిక్స్, ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. ధర రూ. 32,990 ఉంది.
6. డెల్ 15 (2021) 1115జి4 ల్యాప్‌టాప్ – దీంట్లో 15.6 ఇంచుల డిస్‌ప్లే, ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 256 జీబీ ఎస్‌ఎస్‌డీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ధర రూ.38,990 గా ఉంది.