Pooja Hegde : పూజా హెగ్డె, స‌మంత‌కు మ‌ధ్య గొడ‌వ ముగిసిన‌ట్లేనా ?

Pooja Hegde : సెల‌బ్రిటీలు అన్నాక అంద‌రి మ‌ధ్యా పోటీ ఉంటుంది. ఈ క్ర‌మంలోనే కొందరు సెల‌బ్రిటీల‌కు మ‌ధ్య కోల్డ్ వార్ జ‌రుగుతుంటుంది. ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేలా వారి మ‌ధ్య గొడ‌వ‌లు ఉంటాయి. అయితే సోష‌ల్ మీడియా వ‌చ్చాక ఆ మాధ్య‌మంలో కొంద‌రు సెల‌బ్రిటీలు గొడ‌వ ప‌డుతున్నారు. పూజా హెగ్డె, స‌మంత కూడా ఇదే కోవ‌కు చెందుతార‌ని చెప్ప‌వ‌చ్చు. గ‌తంలో వారి మ‌ధ్య కోల్డ్ వార్ న‌డిచింది.

is the war between Pooja Hegde  and Samantha is over
Pooja Hegde

2020లో పూజా హెగ్డె.. స‌మంతకు చెందిన ఓ ఫొటోను షేర్ చేసి.. కింద.. ఏమంత అందంగా ఏమీ లేదు.. అని కాప్ష‌న్ పెట్టింది. దీంతో అప్ప‌ట్లో ఈ విష‌యం వైర‌ల్ అయింది. స‌మంత ఫ్యాన్స్ చాలా మంది పూజా హెగ్డెను ట్రోల్ చేశారు. అయితే ఆమె త‌రువాత త‌న సోషల్ ఖాతా హ్యాక్ అయింద‌ని.. ఆ పోస్టు తాను పెట్టలేద‌ని చెప్పింది. కానీ అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. పూజా హెగ్డెను చాలా మంది విమ‌ర్శించారు. అయితే అప్ప‌టికి ఆ వివాదం స‌ద్దుమ‌ణిగింది.

ఇక రీసెంట్‌గా స‌మంత ఓ వీడియోను పోస్ట్ చేసింది. అందులో ఆమె ఓ పాట‌కు డ్యాన్స్ చేసింది. అది పూజా హెగ్డెకు చెందిన రాబోతున్న సినిమా. త‌మిళ స్టార్ విజ‌య్‌తో క‌లిసి ఆమె న‌టించిన బీస్ట్ సినిమాలోని అర‌బిక్ కుతు అనే పాట‌కు స‌మంత స్టెప్పులేసింది. దీంతో పూజా హెగ్డె ఆ పాట‌ను షేర్ చేసింది. ఈ క్ర‌మంలోనే ఈ పోస్టుతో స‌మంత‌, పూజా హెగ్డెల మ‌ధ్య ఉన్న వార్ ముగిసింద‌ని.. ఇద్ద‌రూ క‌లిసిపోయార‌ని అంటున్నారు. అయితే ఈ ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న గొడ‌వ నిజంగానే ముగిసిందా.. లేదా.. అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Admin

Recent Posts