Balakrishna : టాలీవుడ్ సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ సినీ పరిశ్రమ కోసం ఎంతో కృషి చేశారు. అప్పట్లో వారి సినిమాలు రికార్డులు చెరిపేసేవి. వారి సినిమాలు దాదాపు సెంచరీ కొట్టేవి. అయితే బాలకృష్ణ, చిరంజీవి పలు సందర్భాలలో పోటీ పడగా కొన్ని సార్లు బాలయ్య గెలవగా, కొన్ని సార్లు చిరంజీవి గెలిచారు. ఇప్పటి వరకు ఈ ఇద్దరు సార్లు పండుగ సందర్భంగా 8 సార్లు తలపడ్డారు. 1984 సంవత్సరం సెప్టెంబర్‌లో ఇద్దరూ తమ చిత్రాలతో బరిలోకి దిగారు. మూడవ తేదీన మంగమ్మగారి మనవడు చిత్రంతో బాలకృష్ణ రాగా, మూడు రోజుల తర్వాత ఇంటి గుట్టుతో చిరంజీవి వచ్చారు. మంగమ్మగారి మనవడు మాత్రం సూపర్ హిట్ అయి ఆమెకు మంచి పేరుతెచ్చి పెట్టింది.
1984 లోనే రెండో సారి యుద్ధంలోకి దిగారు. డిసెంబర్ 14 న బాలయ్య కథానాయకుడి చిత్రం రిలీజ్ కాగా వారం తర్వాత 21వ తేదీన చిరు రుస్తుం విడుదలయింది.1986 లో స్టార్ హీరోలు రెండు సార్లు తలపడ్డారు. జనవరి 31న కొండవీటి రాజాగా చిరు వచ్చి విజయ దుందుభి మోగించగా, వారం తర్వాత ఫిబ్రవరి 7న నిప్పులాంటి మనిషిగా వచ్చి బాలకృష్ణ పోటీలో వెనుక పడ్డారు. అలా పలుమార్లు ఈ ఇద్దరు హీరోల మధ్య గట్టి ఫైట్ నడిచింది. చివరి సారి వీరిద్దరూ 2017 లో తల పడ్డారు.
ఇక ఇదిలా ఉంటే అప్పట్లో చిరంజీవి సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. ప్రత్యేకంగా కొన్ని థియేటర్లలో చిరంజీవి సినిమా తప్ప వేరేవి ఆడేవి కావు. అలాంటి వాటిలో పశ్చిమగోదావరి జిల్లాలోని సౌభాగ్య థియేటర్ ఒకటి. ఇందులో చిరంజీవి సినిమా తప్పక విడుదల కావల్సిందే. యావరేజ్ సినిమాలు కూడా ఇక్కడ వంద రోజులు అప్పట్లో ఆడించే వారు. దాంతో ఆ థియేటర్ కు చిరంజీవి సినిమా థియేటర్ అని పేరు పడింది. అయితే 2001లో సౌభాగ్య థియేటర్‌లో చిరంజీవి సినిమా మృగరాజుకు బదులు బాలకృష్ణ నరసింహనాయుడు విడుదల అయింది. మృగరాజు చిత్రం నెగెటివ్ టాక్ తెచ్చుకోవడంతో నరసింహనాయుడు చిత్రాన్ని వంద రోజులు ఆడించారు.