వినోదం

Shobana : ఆ న‌టుడి వేధింపుల వ‌ల్లే శోభ‌న సినిమాల‌కు దూర‌మైంద‌ట‌..!

Shobana : అలనాటి అందాల తార శోభ‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె మంచి న‌టి మాత్ర‌మే కాదు, నృత్య‌కారిణి కూడా. చ‌క్క‌గా నాట్యం చేస్తుంది. న‌ట‌న‌తోనే కాకుండా త‌న డ్యాన్స్‌తోనూ ఈమె ఎంతో పేరు తెచ్చుకుంది. అప్ప‌ట్లో అనేక మంది అగ్ర‌హీరోల‌తో ఈమె యాక్ట్ చేసింది. చిరంజీవితో రౌడీ అల్లుడు, బాల‌కృష్ణ‌తో మువ్వ గోపాలుడు, నారీ నారీ న‌డుమ మురారి, వెంక‌టేష్‌, మోహ‌న్‌బాబుల‌తోనూ ఈమె న‌టించింది. అలాగే తెలుగు, మ‌ళ‌యాళం, త‌మిళం, హిందీ సినిమాల్లోనూ యాక్ట్ చేసింది. ఇక అప్ప‌ట్లో వ‌చ్చిన ర‌జ‌నీకాంత్ చంద్ర‌ముఖి సినిమాకు మూల‌మైన మ‌ళ‌యాళ సినిమా మ‌ణిచిత్ర‌తాళులో అద్భుతంగా యాక్ట్ చేసి అవార్డును కూడా ద‌క్కించుకుంది.

ఇక శోభ‌న మొత్తం 4 భాష‌ల్లోనూ క‌లిపి దాదాపుగా 200కు పైగా సినిమాల్లో న‌టించింది. ఈ క్ర‌మంలోనే ఈమె ఉన్న‌ట్లుండి స‌డెన్ గా సినిమా ఇండ‌స్ట్రీ నుంచి దూరంగా వెళ్లిపోయింది. అయితే ఇందుకు బ‌ల‌మైన కార‌ణ‌మే ఉన్న‌ట్లు తెలుస్తోంది. అప్ప‌ట్లో పేరున్న ఓ హీరో ఈమెను లైంగిక వేధింపుల‌కు గురి చేసేవాడ‌ట‌. దీంతో అత‌ని ఇబ్బందుల‌ను తట్టుకోలేని ఈమె సినిమా ఇండ‌స్ట్రీ నుంచి త‌ప్పుకుంద‌ట‌. కేవ‌లం అత‌ని వ‌ల్లే శోభ‌న సినిమాల‌కు దూర‌మైంద‌ట‌. అత‌ను బాగా పేరున్న హీరో క‌నుక మీడియా కూడా ఆయ‌న పేరు బ‌య‌ట పెట్ట‌లేక‌పోయింది. ఈ కార‌ణాల వ‌ల్లే శోభ‌న సినిమాల‌కు దూరంగా ఉంటుంద‌ని తెలుస్తోంది.

this is the reason why shobhana left film industry

అయితే శోభ‌న అప్పుడప్పుడు నాట్య ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇస్తుంటుంది. ఈమె చేసే నాట్యాన్ని చూసేందుకు చాలా మంది ఆస‌క్తి చూపిస్తుంటారు. అప్ప‌ట్లో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈమె అనూహ్యంగా సినిమా ఇండ‌స్ట్రీ నుంచి వెళ్లిపోవ‌డం నిజంగా అంద‌రినీ షాక్‌కు గురి చేసింది. అయితే కార‌ణాలు ఏమున్న‌ప్ప‌టికీ చాలా మంది అప్ప‌టి హీరోయిన్లు ఇప్పుడు త‌ల్లి పాత్ర‌ల్లో లేదా ఇత‌ర క్యారెక్ట‌ర్ల‌లో న‌టిస్తున్నారు. కానీ శోభ‌న మాత్రం పూర్తిగా సినిమాల‌కు దూర‌మ‌య్యారు.

Admin

Recent Posts