ఆధ్యాత్మికం

Brahma Muhurta : బ్ర‌హ్మ ముహుర్తం అంటే ఏమిటి ? ఆ స‌మ‌యంలో ఏం చేయాలి ? తెలుసా ?

Brahma Muhurta : సృష్టి, స్థితి, ల‌య కార‌కుల‌నే బ్రహ్మ‌, విష్ణువు, మ‌హేశ్వ‌రులు.. అంటార‌న్న విష‌యం విదిత‌మే. అయితే విష్ణువు, శివుడికి ఆల‌యాలు ఉన్నాయి, కానీ బ్ర‌హ్మ‌కు ఆల‌యాలు లేవు. ఆ క‌థ వేరే ఉంది. కానీ రోజులో ఒక ప్ర‌త్యేక‌మైన స‌మ‌యాన్ని మాత్రం సృష్టిక‌ర్త అయిన బ్ర‌హ్మ‌కు కేటాయించారు. అందుక‌నే ఆ స‌మ‌యాన్ని బ్ర‌హ్మ ముహుర్తం అంటారు.

సాధార‌ణంగా ప్ర‌తి రోజూ రాత్రి చివ‌రి ఘ‌డియ‌ల స‌మ‌యాన్ని బ్ర‌హ్మ ముహుర్తంగా పిలుస్తారు. అంటే.. సూర్యోద‌యానికి ముందు స‌మ‌యం అన్న‌మాట‌. సూర్యోద‌యానికి ముందు స‌రిగ్గా ఒక‌టిన్న‌ర గంట‌ల స‌మ‌యాన్ని బ్ర‌హ్మ ముహుర్తం అంటారు. అంటే.. సూర్యోద‌యం ఉద‌యం 6 గంట‌ల‌కు అయితే అంత‌క‌న్నా ముందు 4.30 గంట‌ల నుంచి ఉన్న స‌మ‌యాన్ని బ్ర‌హ్మ ముహుర్తం అంటార‌న్న‌మాట‌. ఈ స‌మ‌యంలో విద్య‌ల‌ను నేర్చుకుంటే రాణించ‌వ‌చ్చ‌ని పురాణాలు చెబుతున్నాయి.

what is Brahma Muhurtam what to do in that

బ్ర‌హ్మ ముహుర్తంలో శ‌రీరం, మ‌న‌స్సు ప్ర‌శాంతంగా ఉంటుంది. ఏకాగ్ర‌త‌, జ్ఞాప‌క‌శక్తి స్థాయిలు ఎక్కువ‌గా ఉంటాయి. అలాంటి స‌మ‌యంలో విద్య‌, సంగీతం, ఏవైనా క‌ళ‌లు.. వంటివి సాధ‌న చేస్తే చ‌క్క‌గా నేర్చుకోవ‌చ్చు. వాటిల్లో రాణిస్తారు. అందుక‌నే తెల్ల‌వారుజామునే లేచి చ‌దువుకోవాల‌ని పెద్ద‌లు చెబుతుంటారు.

ఇక బ్ర‌హ్మ ముహుర్తం పూజ‌ల‌కు కూడా అనుకూల‌మే. ఎవ‌రైనా స‌రే ఆ స‌మ‌యంలో నిద్ర‌లేచి.. కాల‌కృత్యాలు తీర్చుకుని.. శుచిగా స్నానం చేసి త‌మ ఇష్ట‌దైవానికి పూజ‌లు చేస్తే.. కోరిన కోర్కెలు నెర‌వేరుతాయ‌ని పండితులు చెబుతున్నారు. క‌నుక బ్ర‌హ్మ ముహుర్తంలో విద్య‌ల‌ను అభ్య‌సించ‌వ‌చ్చు. లేదా పూజ‌లు చేయ‌వ‌చ్చు. ఇక ఆరోగ్యం కావాల‌నుకునేవారు ఆ స‌మ‌యంలో వ్యాయామం, యోగా, ధ్యానం చేస్తే మంచిది. వ్యాధుల నుంచి బ‌య‌ట ప‌డ‌తారు. ఇలాంటి బ్ర‌హ్మ ముహుర్తాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలి. ఆ ముహుర్తం పైన తెలిపిన‌వి చేయ‌డానికి మంచిద‌ని చెబుతుంటారు.

Admin

Recent Posts