వినోదం

Venkatesh : వెంకటేష్, రోజా మధ్య మాటలు లేకపోవడానికి అసలు కారణం అదేనా ?

Venkatesh : సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల మధ్య పలు మనస్పర్థలు వస్తుంటాయి. ఇలా మనస్పర్థల కారణంగా కొన్ని రోజుల పాటు ఎడమొహం పెడమొహంగా ఉన్నా.. ఆ తర్వాత మామూలుగా ఉంటారు. కానీ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న రోజా, వెంకటేష్ ల మధ్య మనస్పర్థలు తలెత్తి సుమారుగా 25 సంవత్సరాలు అవుతున్నా వీరి మధ్య మాటలు లేవట. అసలు వీరి మధ్య మాటలు లేకపోవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే..

రోజా, వెంకటేష్ హీరో హీరోయిన్లుగా సెల్వమణి దర్శకత్వంలో చినరాయుడు అనే సినిమాను తెరకెక్కించాలని భావించారు. అయితే ఆ సినిమా పలు కారణాల వల్ల ఆగిపోవటం వల్ల వెంకటేష్, విజయశాంతి వేరే దర్శక నిర్మాతలతో ఆ సినిమాను పూర్తిచేశారు. దీంతో రోజా.. మీరు అలా ఎలా చేస్తారంటూ గొడవ పడ్డారు. అయితే అందులో తన తప్పు లేదని వెంకటేష్ చెప్పారు.

this is the reason why venkatesh and roja not talking

అలాగే పోకిరి రాజా సినిమాలో వెంకటేష్, రోజా కలిసి నటించారు. ఈ సినిమాలో ఒక పాట చిత్రీకరణ కోసం చిత్ర బృందం ముంబై వెళ్లారు. అయితే మూడు రోజులపాటు రోజా హోటల్ లో ఉన్నప్పటికీ తనని షూటింగ్ కి పిలవలేదట. దీంతో విసుగు చెందిన రోజా వారితో గొడవపడి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇకపై వెంకటేష్ తో కలిసి నటించకూడదని భావించారట. ఇలా వీరి మధ్య గత కొన్ని సంవత్సరాల నుంచి మాటలు లేవని టాక్‌ వినిపిస్తోంది.

Admin

Recent Posts