business

ఇది భారతదేశంలో అత్యంత సురక్షితమైన కారు..!

మీరు మంచి కారుని కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? అయితే బెస్ట్ మోడల్ గురించి చూద్దాం. టాటా మోటార్స్ భారత దేశంలో అత్యధిక సంఖ్యలో ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటెడ్ కార్లను కలిగి ఉంది. పంచ్.ఈవీ, నెక్సన్, నెక్సన్.ev, కర్వ్, కర్వ్.ev, హారియర్, సఫారీ వంటి కార్లు భారత్ ఎంసీఏపీలో అద్భుతంగా పనిచేస్తాయి. ఏడు వాహనాల్లో AOP అలాగే COP క్యాటగిరీలలో ఏది ఉత్తమ రేటింగ్లని కలిగి ఉంది అనేది ఇప్పుడు చూద్దాం.

సఫారీ, హారియర్, కర్వ్ వంటి ఖరీదైన మోడల్స్ లో ఎక్కువ పాయింట్లు కలిగి ఉన్నాయి. అధిక రేటింగ్స్ ఉన్నప్పటికీ వాటికి అత్యుత్తమ రేటింగ్స్ లేవు.  టాటా యొక్క ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ SUV, Punch. ev 32 కి 31.46 పాయింట్లను కలిగి ఉంది. 49 పాయింట్లకి ఏఓపి క్యాటగిరీలో 45 పాయింట్లు దక్కించుకుంది.

this is the safest car in india

సేఫ్టీ ఫీచర్స్ చాలా బాగున్నాయి. ఆరు ఎయిర్ బ్యాగులు అలాగే ఎలక్ట్రానిక్స్ స్టెబిలిటీ ప్రోగ్రాం, ఐసో ఫిక్స్ వంటి ఫీచర్లు దీనికి ఇచ్చారు. టాటా పంచ్ ఈవీ ధర వచ్చేసి 9.9 లక్షలు. ఎక్స్ షోరూం ధర రూ. 14 లక్షలు. వేరియంట్ ని బట్టి రేటు తగ్గుతుంది. అధిక ట్రిమ్‌స్ ఎంచుకోవడం వలన మీకు 360-డిగ్రీల సరౌండ్ వ్యూ సిస్టమ్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, నాలుగు డిస్క్ బ్రేక్‌లు, హిల్ డిసెంట్ కంట్రోల్, SOS కాలింగ్ వంటి ఫీచర్స్ కూడా వస్తాయి.

Peddinti Sravya

Recent Posts