upasana : మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ బర్త్‌డే సందర్భంగా ఆమెకు పలువురు ప్రముఖులు బర్త్ డే విషెస్ తెలియజేశారు. రామ్ చరణ్, ఉపాసన చేసిన పోస్ట్‌లు వైరల్‌గా మారాయి. ఆచార్య సెట్‌లో తల్లితో కలిసి ఉన్న ఫోటోను చరణ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు రామ్ చరణ్ . ఈ ఫొటోలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు. చిరు, చరణ్ నక్సలైట్స్ గెటప్ లో కనిపించారు. నా గురించి నీకు తెలిసినంతగా ఎవ్వరికి తెలియదు హ్యాపీ బర్త్ డే మా.. అంటూ రాసుకొచ్చాడు చరణ్. ఈ పోస్ట్ పై మెగా అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఇక ఉపాసన కూడా తన అత్తమ్మకు ఆత్మీయమైన శుభాకాంక్షలు తెలియజేసింది. ఆమె మెగా కుటుంబంతో ఉన్న అందమైన జ్ఞాపకాలకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. అంతేకాదు అత్తగారిపై తనకున్న ప్రేమను వ్యక్తం చేస్తూ “హ్యాపీ బర్త్‌డే మై డియరెస్ట్ అత్తమ్మా. మీరు మీ వైవాహిక జీవితానికి మూలాధారం. నాతో RC & రైమ్‌ని పంచుకున్నందుకు ధన్యవాదాలు. లవ్ యూ” అని రాసింది. ఇంకేముందీ ఈ వీడియో చూసిన నెటిజన్లు వీరిద్దరూ తల్లీకూతుళ్లలా చక్కగా కలిసిపోవడం చూసి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఇటీవల వాలెంటైన్స్ డే సందర్భంగా ఉపాసన.. తన పదేళ్ల వైవాహిక జీవితంలోని కొన్ని గుర్తులను ఓ వీడియోలాగా చేశారు.
అంతే కాకుండా లవర్స్‌కు కొన్ని విలువైన టిప్స్ కూడా ఇచ్చారు. అలాగే తన అత్త సురేఖ కొణిదెల పుట్టినరోజుకు కూడా అలాంటి ఒక వీడియోనే తయారు చేశారు ఉపాసన. అయితే ఈ వీడియోలో వారిద్దరు కలిసి కుటుంబంతో సంతోషంగా గడిపిన సందర్భాలు ఉన్నాయి.ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన మహిళా పారిశ్రామికవేత్తలలో ఉపాసన కామినేని ఒకరు. ఒక శక్తివంతమైన వ్యాపార కుటుంబం నుండి వచ్చిన ఉపాసన గ్రాడ్యుయేషన్ తర్వాత వ్యాపార ప్రపంచంలోకి ప్రవేశించింది. 2012లో రామ్ చరణ్‌తో వివాహం తర్వాత కూడా మంచి వ్యాపారవేత్తగా కొనసాగుతోంది.