Upendra : లేడీ గెట‌ప్‌లో ఉన్న ఈ స్టార్ న‌టుడు ఎవ‌రో తెలుసా ?

Upendra : వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తాడ‌ని క‌న్న‌డ స్టార్ న‌టుడు ఉపేంద్ర‌కు ఎంతో పేరుంది. ఆయ‌న భిన్న‌మైన జోన‌ర్‌లలో విచిత్ర‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో అల‌రిస్తుంటారు. ఇక ఆయ‌న తాజాగా న‌టిస్తున్న చిత్రం.. హోమ్ మినిస్ట‌ర్‌. ఈ మూవీ ఏప్రిల్ 1వ తేదీన థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Upendra lady getup photo viral in social media
Upendra

కాగా ఉపేంద్ర త‌న ట్విట్ట‌ర్ ప్రొఫైల్ పిక్చ‌ర్‌ను మార్చారు. ఒక అమ్మాయి ఫొటోను ప్రొఫైల్ పిక్చ‌ర్‌గా పెట్టారు. అయితే తీరా చూస్తే అది ఆయ‌నే కావ‌డం విశేషం. ఆయ‌న లేడీ గెట‌ప్ ధరించి ఆ ఫొటో దిగార‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. త‌న సినిమాలో ఓ పాత్ర కోసం ఇలా లేడీ గెట‌ప్ వేసి ఉంటార‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న లేటెస్ట్ లేడీ గెట‌ప్ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ఇక హోమ్ మినిస్ట‌ర్ సినిమాలో ఉపేంద్ర‌కు జోడీగా న‌టి వేదిక యాక్ట్ చేసింది. దీనికి సుజ‌య్ శ్రీ‌హ‌రి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. పూర్ణ నాయుడు ఈ సినిమాను శ్రేయాస్ చిత్ర బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. ఘిబ్ర‌న్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఉపేంద్ర తాజాగా వ‌రుణ్ తేజ్ ఘ‌ని చిత్రంలోనూ కీల‌క‌పాత్ర‌లో న‌టించారు. ఈ సినిమా ఏప్రిల్ 18వ తేదీన విడుద‌ల కానుంది.

Editor

Recent Posts