Muscles : శరీరం దృఢంగా మారాలని.. కండలు బాగా పెరగాలని.. చాలా మంది కోరుకుంటారు. అందుకనే వ్యాయామలు గట్రా చేస్తుంటారు. అయితే ఆహారం విషయంలో మాత్రం పొరపాటు చేస్తుంటారు. కండలు పెంచాలి సరే.. కానీ ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి.. అనే విషయం చాలా మందికి తెలియదు. దీంతో వారు జంక్ ఫుడ్, చక్కెరలు, పిండి పదార్థాలు, కొవ్వులు ఉండే ఆహారాలను అధికంగా తింటుంటారు. అయితే కండలు పెంచాలంటే వాటిని కాదు.. వేరే ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. కండలు పెంచాలని వ్యాయామం చేసేవారు రోజూ తినేదాని కన్నా అదనంగా 300 నుంచి 500 క్యాలరీల శక్తిని ఇచ్చే ఆహారాలను తీసుకోవాలి. అంటే.. రోజూ తినే దాని కన్నా కాస్త ఎక్కువ ఆహారం తినాలన్నమాట. అది కూడా ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. అప్పుడే కండలు పెరుగుతాయి.
2. ప్రతి ఒక్కరు తమ శరీర బరువు 1కిలోకు 1.5 నుంచి 2 గ్రాముల మేర ప్రోటీన్ అందేట్లు చూసుకోవాలి. అంటే 70 కిలోలు ఉన్న ఒక వ్యక్తికి కిలోకు 2 గ్రాముల ప్రోటీన్ అనుకుంటే.. 140 గ్రాములు అన్నమాట. రోజుకు ఇంత మోతాదులో ప్రోటీన్లను తీసుకోవాలి. ఇలా శరీర బరువును బట్టి రోజూ తీసుకోవాల్సిన ప్రోటీన్ల శాతాన్ని లెక్కించాలి. దీంతో శరీరానికి ప్రోటీన్లు బాగా లభిస్తాయి. దీని వల్ల కండలు పెరుగుతాయి. శరీరం దృఢంగా మారుతుంది.
3. గుడ్లు, చేపలు, చికెన్, పాలు, పాల ఉత్పత్తులు, నట్స్, విత్తనాల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి కావల్సిన ప్రోటీన్లను అందిస్తాయి. దీంతోపాటు వీటిల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి. ఇవి శరీరాన్ని దృఢంగా మారుస్తాయి. కనుక వీటిని రోజూ తీసుకోవాలి.
4. తాజా పండ్లు, కూరగాయలను కూడా రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. దీంతోపాటు నెయ్యి, కొబ్బరినూనెలను కూడా తీసుకోవచ్చు. ఇవి మనకు పోషణను, శక్తిని అందిస్తాయి. శరీరం దృఢంగా మారేలా చేస్తాయి.
5. కండలు బాగా పెరగాలని కోరుకునే వారు పైన తెలిపిన ఆహారాలను తీసుకోవాలి. దీంతోపాటు బరువులు ఎత్తే వ్యాయామాలు బాగా చేయాలి. దీంతో మజిల్స్ ఏర్పడతాయి. శరీరం దృఢంగా మారుతుంది. దేహ దారుఢ్యం వస్తుంది.