information

UPI ట్రాన్సాక్ష‌న్ లిమిట్స్ మారాయి.. గుర్తు పెట్టుకోండి..!

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ గ‌తంలో పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేసిన‌ప్పటి నుంచి డిజిట‌ల్ పేమెంట్ల‌ను ఎక్కువ‌గా చేయాల‌ని చెప్పిన విష‌యం తెలిసిందే. అందుక‌నే దేశంలో ప్ర‌స్తుతం న‌గ‌దు వినియోగం క‌న్నా డిజిట‌ల్ లావాదేవీలే ఎక్కువ‌య్యాయ‌ని చెప్ప‌వ‌చ్చు. ముఖ్యంగా యూపీఐ యాప్స్ ద్వారా పేమెంట్స్ చేస్తున్నారు. అయితే త‌క్కువ ప‌రిమితి ఉన్న ట్రాన్సాక్ష‌న్స్ చేసేందుకు పిన్ అవ‌స‌రం లేకుండా యూపీఐ లైట్‌ను గ‌తంలోనే ఎన్‌పీసీఐ ప్ర‌వేశ‌పెట్టింది. అయితే యూపీఐ లైట్‌కు గాను న‌వంబ‌ర్ 1 నుంచి ట్రాన్సాక్ష‌న్ లిమిట్స్ మారాయి. ఈ మేర‌కు ఎన్‌పీసీఐ ఇప్ప‌టికే నిర్ణ‌యం తీసుకుంది.

యూపీఐ లైట్ ద్వారా వినియోగ‌దారులు ఎలాంటి పిన్ లేకుండానే ట్రాన్సాక్షన్స్ చేయ‌వ‌చ్చు. ఇందుకు గాను రూ.500 వ‌ర‌కు ప‌రిమితి ఉంది. అలాగే వాలెట్ బ్యాలెన్స్‌ను రూ.2000 వ‌ర‌కు పెట్టుకోవ‌చ్చు. రోజుకు రూ.4000 వ‌ర‌కు యూపీఐ లైట్ ద్వారా చెల్లింపులు చేయ‌వ‌చ్చు. అయితే న‌వంబ‌ర్ 1 నుంచి ఈ లిమిట్స్ మారాయి. ఒక ట్రాన్సాక్ష‌న్ ప‌రిమితిని రూ.500 నుంచి రూ.1000 కి పెంచారు. అలాగే వాలెట్ బ్యాలెన్స్ లిమిట్‌ను రూ.2000 నుంచి రూ.5000కు పెంచారు. మారిన‌ ఈ ట్రాన్సాక్ష‌న్ లిమిట్స్ న‌వంబ‌ర్ 1 నుంచి అమ‌లులోకి వ‌చ్చాయ‌ని ఎన్‌పీసీఐ వెల్ల‌డించింది.

upi transaction limits are changed

ఇక వాలెట్ బ్యాలెన్స్ అయిపోతే ఆటో టాప‌ప్ అయ్యే విధంగా కూడా ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ ఫీచ‌ర్ కూడా న‌వంబ‌ర్ 1 నుంచి యూపీఐ లైట్‌లో అందుబాటులోకి వ‌చ్చింది. క‌నుక వినియోగ‌దారులు ఈ మార్పుల‌ను గ‌మ‌నించాల్సి ఉంటుంది.

Admin

Recent Posts