హెల్త్ టిప్స్

Breastfeeding : పిల్లలకు పాలిచ్చే తల్లులు ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి..!

Breastfeeding : ఒక స్త్రీ జీవితంలో గ‌ర్భం ధరించ‌డం దగ్గరనుండి బిడ్డని కనేంత వరకు ఒక ఎత్తు. బిడ్డ పుట్టాక బిడ్డతో పాటుగా తనను, తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. చంటి బిడ్డను చూసుకునే క్రమంలో సరైన ఆహారం తీసుకోవాలి. కంటి నిండా నిద్ర పోవాలి. కానీ అది అసాధ్యం. ఏ రాత్రో చంటి బిడ్డ పాలకు లేచి ఏడుస్తాడో తెలియని పరిస్ధితి. కంటికి రెప్పలా బిడ్డని కాచుకుని చూసుకునే క్రమంలో కంటినిండా నిద్ర కరువవుతుంది. అలాంటప్పుడు తన ఆరోగ్యం దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పాలిచ్చే తల్లి కడుపునిండా ఆహారం తీసుకోవాలి. వీటితో పాటుగా పెద్డలు చెప్పే జాగ్రత్తలు పాటించాలి.

పాలిచ్చే తల్లులకు అప్పుడప్పుడు పాలు గడ్డ కట్టి చలి జ్వరం వస్తుంది. తీవ్రమైన చలి మాత్రమే కాదు రొమ్ము నొప్పి కూడా ఉంటుంది. ఈ వేదన అంతా ఇంతా కాదు. ఒకవైపు నొప్పి భరించలేక మరోవైపు బిడ్డకు పాలు ఇవ్వలేక నరకయాతన కనబడుతుంది .దీనినే మన నాన్నమ్మలు, అమ్మమ్మలు రొమ్ముసుడి అంటారు. బిడ్డల తల సుడి రొమ్ముకి తగిలినట్టయితే పాలు గడ్డ కట్టి చలిజ్వరం వస్తుంది అంటారు. పిల్లల సుడికి దీనికి ఏంటి సంబంధం అని ఈ కాలపు పిల్లలు దీన్ని లైట్ తీసుకున్నప్పటికీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

breastfeeding mothers must take these tips

అంతే కాదు పాలు ఇచ్చేటప్పుడు పిల్లలకు ఎప్పుడూ ఒక రొమ్మే ఇవ్వకూడదు. దీనివల్ల రెండో రొమ్ములు పాలు రావడం మానేయడమే కాదు, వక్షోజాల పరిమాణంలో కూడా తేడా వస్తుంది. ఒక రొమ్ము కొద్ది సేపు మరొక రొమ్ము కొద్దిసేపు ఇవ్వడం కూడా శ్రేయస్కరం కాదు. దీనివల్ల పిల్లలకు కావలసిన పోషకాలు అందవు. ఎందుకంటే పిల్లలకు ఒక రొమ్ము పాలు కొంచెం ఇచ్చి ఆపేస్తే అందులో ముందుగా వాటర్ కంటెంట్ మాత్రమే ఉంటుంది. తర్వాత కొవ్వు సంబంధిత పోషకాలు ఉంటాయి. కాబట్టి ఒక రొమ్ము కంప్లీట్ గా ఇచ్చాక, ఇంకొక రొమ్ము ఇవ్వాలి.

దాంతో పాటు వారు త‌మ‌ ఆరోగ్యాన్ని చూసుకోవాలి. పెద్దల మాట పెడచెవిన పెట్టరాదు. ఎందుకంటే రొమ్ముసుడి చాలా భయంకరమైన నొప్పిని కలిగిస్తుంది. సుడి తాకడం వల్ల కాదు పాలు ఇవ్వక గడ్డ కట్టడం వల్ల అని అనుకునే వాళ్లు పిల్లలకు ఎప్పటికప్పుడు పాలు ఇస్తూ వారు దాని బారిన పడకుండా చూసుకోవాలి.

Admin

Recent Posts