Urfi Javed : బాలీవుడ్ నటి, బిగ్ బాస్ ఓటీటీ హిందీ ఫేమ్ ఉర్ఫి జావేద్ తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఈమె వస్త్రధారణే చాలా విచిత్రంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు మోడ్రన్ దుస్తుల్లో కనిపిస్తూ అలరిస్తుంటుంది. ఈమె రోజుకో కొత్తదైన.. విచిత్రమైన డ్రెస్ ధరిస్తుంటుంది. దీంతో ఈమె ఫొటోలు వైరల్ అవుతుంటాయి. ఇక తాజాగా ఉర్ఫి జావేద్ మరోసారి వార్తల్లో నిలిచింది.
హోలీ పండుగ సందర్భంగా చాలా మంది సెలబ్రిటీలు హోలీ ఆడారు. ఇక ఉర్ఫి జావేద్ కూడా హోలీ ఆడింది. ఈ క్రమంలోనే ఆమె చుడీదార్ ధరించింది. అయితే అది ముందు భాగంలో ఓపెన్‌గా ఉంది. ఎద అందాలు క్లియర్‌గా కనిపిస్తున్నాయి. సాధారణంగా ఇలాంటి డ్రెస్‌లు చాలా బాగుంటాయి. కానీ ఉర్ఫి జావేద్ మాత్రం ఈ డ్రెస్‌లో కూడా అందాలను ప్రదర్శించింది. దీంతో నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తూ విమర్శిస్తున్నారు.
హోలీ రోజు అయినా మంచి డ్రెస్ ధరించ వచ్చుకదా.. చుడీదార్‌ను ఇలా ధరించి దానికి ఉన్న గౌరవాన్ని ఎందుకు పాడు చేశావు.. ఇక ఇలాంటి డ్రెస్‌లు ధరించడం ఆపు.. అంటూ నెటిజన్లు ఉర్ఫి జావేద్‌ను విమర్శిస్తున్నారు. ఇక ఈమె హోలీ ఆడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.