RRR : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ఈ మూవీ విడుదలవుతోంది. ఇక ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సినిమాకు టిక్కెట్ల ధరలను పెంచుకునే విధంగా వెసులుబాటు కల్పించింది. ఇది ఈ మూవీకి ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. ఇక రెండు రాష్ట్రాల్లోనూ మొదటి వారం రోజుల పాటు రోజుకు 5 షోస్‌ను ప్రదర్శించుకునే వీలు కూడా కల్పించారు.
కాగా ఆర్ఆర్ఆర్ సినిమాకు గాను 24 అర్థరాత్రి నుంచే కొన్ని థియేటర్లలో బెనిఫిట్ షోస్ వేయనున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీలో ఉన్న 4 థియేటర్లు, ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న 3 థియేటర్లలో 24వ తేదీ రాత్రి 12.30 గంటలకు ఆర్ఆర్ఆర్ సినిమా బెనిఫిట్ షోస్ వేయనున్నారు. దీంతో ముందు రోజు రాత్రే సినిమా ఎలా ఉందో అప్‌డేట్ రానుంది. ఇక ఈ థియేటర్లలో ఒక్కో టిక్కెట్ సుమారుగా రూ.3వేల నుంచి నుంచి రూ.5వేలకు అమ్ముడయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
కాగా ఏపీలో బెనిఫిట్ షోస్‌కు అనుమతి ఇవ్వలేదు. కానీ ఉదయం షోను ప్రదర్శించుకునే వీలు కల్పించారు. ఇక అమెరికాలో ఈ మూవీకి ప్రీమియర్స్ వేసి 2 మిలియన్ల డాలర్లను ఇప్పటికే రాబట్టారు. ఈ క్రమంలోనే అమెరికాలో ఓపెనింగ్ వీకెండ్‌లో ఆర్ఆర్ఆర్ సరికొత్త రికార్డును సృష్టించింది. ఇక ఈ మూవీలో ఎన్‌టీఆర్, రామ్ చరణ్‌లు స్వాతంత్య్ర సమరయోధుల పాత్రల్లో కనిపించనుండగా.. డీవీవీ దానయ్య నిర్మించారు.