Vangi Bath : వంకాయలతో ఇలా వేడి వేడి రైస్‌ చేసి ఎప్పుడైనా తిన్నారా.. ఒక్కసారి టేస్ట్‌ చేస్తే మళ్లీ కావాలంటారు..!

Vangi Bath : వంకాయలు అనగానే మనకు ముందుగా గుర్తకు వచ్చేది.. వాటితో చేసే గుత్తి వంకాయ కూర. ఈ కూర అంటే ఇష్టం లేని వారు ఉండరు.. అంటే అతిశయోక్తి కాదు. బగారా రైస్‌తో కలిపి గుత్తి వంకాయ కూరను తింటుంటే.. వచ్చే మజాయే వేరు. ఆ రుచిని మాటల్లో వర్ణించలేం. అంత టేస్టీగా ఆ కూర ఉంటుంది. అయితే వంకాయలతో ఇలా మసాలా కూరను మాత్రమే కాదు.. ఎంచక్కా పులావ్‌ రైస్‌ను కూడా చేసుకోవచ్చు. దాన్నే వాంగీ బాత్‌ అని కూడా అంటారు. కొన్ని ప్రాంతాల్లో దీన్ని ఇష్టంగా లాగిస్తారు కూడా. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వాంగీ బాత్‌ తయారీకి కావల్సిన పదార్థాలు..

బియ్యం – ఒకటిన్నర కప్పు, నీళ్లు – మూడున్నర కప్పులు, వంకాయలు – పావు కిలో, క్యాప్సికం – ఒకటి, ఉల్లిపాయలు – నాలుగు, వాంగీ బాత్‌ పౌడర్‌ – ఒక టేబుల్‌ స్పూన్‌, పసుపు – అర టీస్పూన్‌, నెయ్యి – రెండు టీస్పూన్లు, ఉప్పు – తగినంత, పల్లీలు – మూడు టేబుల్‌ స్పూన్లు, ఆవాలు – ఒక టీస్పూన్‌, మినప పప్పు – ఒక టీస్పూన్‌, శనగపప్పు – ఒక టీస్పూన్‌, ఇంగువ – అర టీస్పూన్‌, కొత్తిమీర తురుము – రెండు టేబుల్‌ స్పూన్లు.

Vangi Bath recipe in telugu very tasty how you ever ate
Vangi Bath

వాంగీ బాత్‌ను తయారు చేసే విధానం..

బియ్యం మరీ మెత్తగా కాకుండా పలుకుగా వండాలి. ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కోయాలి. వంకాయలు కూడా పొడవాటి ముక్కలుగా కోయాలి. బాణలిలో నెయ్యి వేసి కాగాక ఆవాలు, మినప పప్పు, శనగపప్పు, ఇంగువ వేసి వేయించాలి. తరువాత పల్లీలు కూడా వేసి వేగాక ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి బాగా వేయించాలి. తరువాత క్యాప్సికమ్‌ ముక్కలు కూడా వేసి వేగాక వంకాయ ముక్కలు కూడా వేసి వేయించాలి. తరువాత ఉప్పు, పసుపు, వాంగీ బాత్‌ పొడి వేసి కలిపి ఉడికించిన అన్నం వేసి కలిపి ఓ రెండు నిమిషాలు వేయించి దించాలి. దీనిపై కొత్తిమీర తురుముతో అలంకరించుకోవాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే వాంగీ బాత్‌ రెడీ అవుతుంది. దీన్ని నేరుగా అలాగే తినవచ్చు. లేదా రైతా ఏదైనా కూరతో తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌, మధ్యాహ్నం లంచ్‌.. ఎందులోకి అయినా సరే వాంగీ బాత్‌ ఎంతో రుచిగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు.

Editor

Recent Posts