Vankaya Pulao : వంకాయలతో పులావ్‌.. ఎప్పుడైనా తిన్నారా.. రుచి అద్భుతంగా ఉంటుంది..

Vankaya Pulao : వంకాయలు అనగానే మనకు ముందుగా గుత్తి వంకాయ కూర.. వంకాయ టమాటా.. వంకాయ ఫ్రై.. వంటి వంటకాలు గుర్తుకు వస్తాయి. వంకాయలతో కొందరు పచ్చడి కూడా చేస్తుంటారు. అయితే వంకాయలతో పులావ్‌ను కూడా చేసుకోవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని తయారు చేయడం కూడా సులభమే. శాకాహార ప్రియులు ఈ పులావ్‌ను ఎంతో ఇష్టపడతారు. మాంసాహార ప్రియులు కూడా దీన్ని లొట్టలేసుకుంటూ తింటారు. ఇక వంకాయలతో పులావ్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వంకాయల పులావ్‌ తయారీకి కావల్సిన పదార్థాలు..

బాస్మతి బియ్యం – రెండు కప్పులు (అర గంట ముందు నానబెట్టుకోవాలి), వంకాయలు – పది, దాల్చిన చెక్క – ఒక ముక్క, యాలకులు – నాలుగు, అనాస పువ్వు – ఒకటి, లవంగాలు – నాలుగు, ఉప్పు – తగినంత, గరం మసాలా – అర టీస్పూన్‌, నూనె – పావు కప్పు, నెయ్యి – రెండు టేబుల్‌ స్పూన్లు, ఉల్లిపాయలు – రెండు, బిర్యానీ ఆకు – ఒకటి, టమాటాలు – రెండు, పసుపు – అర టీస్పూన్‌, ధనియాల పొడి – ఒక టీస్పూన్‌, గరం మసాలా – ఒక టీస్పూన్‌, బిర్యానీ మసాలా – ఒక టీస్పూన్‌, కారం – పెద్ద టీస్పూన్‌, పెరుగు – అర కప్పు.

Vankaya Pulao make in this method everyone likes it
Vankaya Pulao

మసాలా తయారీకి కావల్సిన పదార్థాలు..

వేయించిన పల్లీలు – పావు కప్పు, వేయించిన ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు, వెల్లుల్లి రెబ్బలు – 5, పసుపు – అర టీస్పూన్‌, కారం – ఒక టీస్పూన్‌, ధనియాల పొడి – ఒక టీస్పూన్‌.

వంకాయల పులావ్‌ను తయారు చేసే విధానం..

మసాలా కోసం పెట్టుకున్న పదార్థాలు, తగినంత ఉప్పును మిక్సీలో వేసుకుని మెత్తగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని గాట్లు పెట్టుకున్న వంకాయల్లో కూరాలి. స్టవ్‌ మీద కుక్కర్‌ని పెట్టి నెయ్యి, నూనె వేయాలి. నెయ్యి కరిగాక దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, అనాస పువ్వు, బిర్యానీ ఆకు వేయించుకుని ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పెరుగు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా, కారం, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి. అన్నీ ఉడికాక వంకాయలు, కడిగిన బియ్యం, మూడున్నర కప్పుల నీళ్లు పోసి మూత పెట్టి రెండు విజిల్స్‌ వచ్చాక స్టవ్‌ ఆఫ్‌ చేయాలి. దీంతో రుచికరమైన వంకాయ పులావ్‌ రెడీ అవుతుంది. దీన్ని నేరుగా అలాగే తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు.

Share
Editor

Recent Posts