Viral Fever : వైరల్‌ ఫీవర్‌ వచ్చిన వారు ఈ చిట్కాలను పాటిస్తే త్వరగా కోలుకుంటారు..!

Viral Fever : ప్రస్తుతం నడుస్తున్నది జ్వరాల సీజన్‌. ఎక్కడ చూసినా అనేక మంది జ్వరాల బారిన పడి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్‌ వంటి విష జ్వరాలు సంభవిస్తున్నాయి. అయితే ఇవి కాకుండా సాధారణ వైరల్‌ ఫీవర్‌ కూడా చాలా మందికి వస్తోంది. ఇది వచ్చేందుకు కారణాలు అనేకం ఉంటాయి. కానీ ఈ జ్వరం వస్తే మాత్రం ఇతర జ్వరాల్లాగే అనేక లక్షణాలు కనిపిస్తాయి. వైరల్‌ ఫీవర్‌ వచ్చిన వారిలో వికారం, ఒళ్లు నొప్పులు, చర్మం పొడిబారిపోవడం, ఆకలి లేకపోవడం, తలనొప్పి, వాంతికి వచ్చినట్లు ఉండడం, మలబద్దకం, మూత్రం డార్క్‌ కలర్‌లో రావడం, మూత్రం తక్కువగా రావడం వంటి లక్షణాలు వైరల్‌ ఫీవర్‌ వచ్చిన వారిలో కనిపిస్తాయి.

అయితే వైరల్‌ ఫీవర్‌ వచ్చినవారు డాక్టర్‌ సలహా మేరకు చికిత్స తీసుకోవాలి. ఈ క్రమంలోనే వారు తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాలతోపాటు ద్రవాహారాలు, పండ్లు వంటి వాటిని అధికంగా తీసుకోవాలి. దీంతో జ్వరం నుంచి త్వరగా కోలుకుంటారు. ఇక వైరల్‌ ఫీవర్‌ వచ్చిన వారు ఈ చిట్కాలను పాటిస్తే జ్వరం నుంచి త్వరగా కోలుకోవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Viral Fever patients follow these natural remedies for quick recovery
Viral Fever

వైరల్‌ ఫీవర్‌ వచ్చిన వారు ధనియాల కషాయాన్ని పూటకు ఒక కప్పు చొప్పున తాగుతుండాలి. దీంతో జ్వరం, ఒళ్లు నొప్పులు తగ్గుతాయి. త్వరగా కోలుకుంటారు. అలాగే పూటకు అర టీస్పూన్‌ చొప్పున తిప్ప తీగ రసాన్ని తాగుతున్నా కూడా జ్వరం తగ్గుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. వీటితోపాటు దొండ ఆకుల రసాన్ని నుదుటిపై పట్టీలా వేయాలి. దీంతో కూడా జ్వరం తగ్గుతుంది.

జీలకర్ర కషాయాన్ని తాగుతున్నా కూడా జ్వరం నుంచి త్వరగా కోలుకుంటారు. జీలకర్రలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తాయి. దీంతో జ్వరం త్వరగా తగ్గుతుంది. ఇక జ్వరం వచ్చిన వారు వీలైనంత వరకు ద్రవాహారాలనే తీసుకోవాలి. అలాగే సరైన విశ్రాంతి అవసరం. అప్పుడే త్వరగా కోలుకోవచ్చు. ఇక జ్వరం ఎంత ప్రయత్నించినా తగ్గకపోతే హాస్పిటల్‌లో అడ్మిట్‌ అయి చికిత్స తీసుకోవాలి. లేదంటే ప్రాణాంతకమవుతుంది.

Share
Editor

Recent Posts