Veg Soya Keema Curry : ధాబా స్టైల్‌లో ఈ వెజ్ సోయా కీమా క‌ర్రీని ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Veg Soya Keema Curry : మ‌నం మీల్ మేక‌ర్ ల‌తో ర‌క‌ర‌కాల వంటకాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. మీల్ మేక‌ర్ ల‌తోచేసిన కూర‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన ప్రోటీన్స్ తో పాటు ఇత‌ర పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు ఈ మీల్ మేక‌ర్ ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే కీమా క‌ర్రీని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ కీమా క‌ర్రీ చాలారుచిగా ఉంటుంది. ఈ క‌ర్రీ మ‌న‌కు ఎక్కువ‌గా ధాబాల‌లో ల‌భిస్తూ ఉంటుంది. ఈ క‌ర్రీని మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ధాబా స్టైల్ సోయా కీమా క‌ర్రీని మ‌నం ఇంట్లోనే ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

సోయా కీమా క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చిన్న‌గా ఉండే మీల్ మేక‌ర్ – అర క‌ప్పు, ప‌చ్చిమిర్చి – 3, పెరుగు – 2 టేబుల్ స్పూన్స్, నూనె – 4 టేబుల్ స్పూన్స్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ల‌వంగాలు – 3, యాల‌కులు – 2, దాల్చిన చెక్క -అర ఇంచు ముక్క‌, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, క‌రివేపాకు -ఒక రెమ్మ‌, కారం -ఒక టీ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, త‌రిగిన ట‌మాట – 1, ఉప్పు – త‌గినంత‌, ఉడికించిన ప‌చ్చి బ‌ఠాణీ- అర క‌ప్పు, నీళ్లు – అర గ్లాస్, క‌సూరి మెంతి – అర టీ స్పూన్, బ‌ట‌ర్ – 2 టేబుల్ స్పూన్స్, ఫ్రెష్ క్రీమ్ – ఒక టేబుల్ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Veg Soya Keema Curry recipe in telugu make in this way
Veg Soya Keema Curry

సోయా కీమా క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో మీల్ మేక‌ర్ ను తీసుకోవాలి. త‌రువాత ఇందులో వేడి నీటిని పోసి 5 నిమిషాల పాటు ఉంచాలి. త‌రువాత ఈవేడి నీటిని పార‌బోసి చ‌ల్ల‌టి నీటిని పోయాలి. ఇప్పుడు ఈ మీల్ మేక‌ర్ ల‌ను ఎక్కువ‌గా ఉండే నీరంతా పోయేలా చేత్తో పిండుతూ జార్ లోకి తీసుకోవాలి. త‌రువాత ఇదే జార్ లో పెరుగు, ప‌చ్చిమిర్చి వేసి మ‌రీ మెత్త‌గా కాకుండా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత జీల‌క‌ర్ర, మ‌సాలా దినుసులు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, క‌రివేపాకు వేసి వేయించాలి. వీటిని రెండునిమిషాల పాటు వేయించిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిని ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించిన త‌రువాత ప‌సుపు, కారం, ధ‌నియాల పొడి, జీల‌క‌ర్ర పొడి వేసి కల‌పాలి.

త‌రువాత ట‌మాట ముక్క‌లు, ఉప్పు, మిక్సీ ప‌ట్టుకున్న మీల్ మేక‌ర్ మిశ్ర‌మం వేసి క‌ల‌పాలి. ఇప్పుడు మంట‌ను చిన్న‌గా చేసి 4 నుండి 5 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత బ‌ఠాణీ వేసి క‌ల‌పాలి. దీనిని ఒక నిమిషం పాటు వేయించిన త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా ఉడికించిన త‌రువాత క‌సూరి మెంతి, బ‌ట‌ర్, ప్రెష్ క్రీమ్, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించి కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే సోయా కీమా క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని రోటీ, చ‌పాతీ, నాన్, బ‌ట‌ర్ నాన్ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి దీనిని రుచి చూస్తే మళ్లీ మ‌ళ్లీ ఇదే కావాల‌ని అడ‌గ‌క మాన‌రు.

D

Recent Posts