Vijay Devarakonda New Look : సెలబ్రిటీలు అన్నాక తరచూ హెయిర్ స్టైల్స్‌ను మారుస్తుండడం సహజమే. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌ను అలరించడం కోసం కొత్త కొత్త హెయిర్ స్టైల్స్ ను అనుసరిస్తుంటారు. అయితే యంగ్ హీరో విజయ్ దేవరకొండ మాత్రం గత 2 సంవత్సరాల నుంచి ఒకే హెయిర్ స్టైల్‌తో ఉన్నాడు. పొడవైన వెంట్రుకలతో విజయ్ కనిపించాడు. కానీ తాజాగా అతను తన స్టైల్‌ను మార్చాడు. పొడవైన వెంట్రుకలను పూర్తిగా కట్ చేసి.. కొత్త లుక్‌లో కనిపించాడు.
కాగా విజయ్ దేవరకొండ నూతన లుక్‌కు చెందిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విజయ్‌ని ఇలా చూసి ఎవరూ గుర్తు పట్టడం లేదు. చూస్తుంటే అతను మిలిటరీ కటింగ్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న ప్రైమ్ వాలీబాల్ లీగ్‌లో అతను కనిపించాడు. దీంతో విజయ్‌ని కెమెరాలు క్లిక్‌మనిపించాయి.
అయితే విజయ్ ఉన్నట్లుండి తన పొడవైన హెయిర్‌ను కట్ చేయడంతో అతను తన తరువాతి సినిమా కోసమే ఇలా చేసి ఉంటాడని భావిస్తున్నారు. విజయ్ నటించిన లైగర్ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ క్రమంలోనే ఇప్పటికే పూరీ, విజయ్‌ల కాంబినేషన్‌లో జనగనమణ అనే మరో కొత్త సినిమాను ప్రకటించారు. దీంతో విజయ్ దేవరకొండ ఈ సినిమా కోసమే కొత్త హెయిర్ కట్ ను చేయించుకుని ఉంటాడని భావిస్తున్నారు.
కాగా లైగర్ సినిమా ఈ ఏడాది ఆగస్టు 25వ తేదీన విడుదల కానుంది. ఇందులో అంతర్జాతీయ మాజీ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ కీలక పాత్రలో నటించారు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఈ మూవీతో తెలుగు తెరకు పరిచయం అవుతోంది.