Vitamins : మ‌న శ‌రీరంలో ఏయే విట‌మిన్లు లోపిస్తే.. ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో తెలుసా ?

Vitamins : మ‌న శ‌రీరం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ అన్ని పోష‌కాలు క‌లిగిన ఆహారాల‌ను తీసుకోవాలి. అప్పుడే పోష‌కాహార లోపం ఏర్ప‌డ‌కుండా ఉంటుంది. దీంతోపాటు ఎలాంటి వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉంటాం. అయితే పోష‌కాల విష‌యానికి వ‌స్తే.. వాటిలో విట‌మిన్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈ క్ర‌మంలోనే మనం రోజూ అన్ని విట‌మిన్లు అందేలా చూసుకోవాలి. ఇక ఏయే విట‌మిన్లు లోపిస్తే మ‌న శ‌రీరం ఎలాంటి ల‌క్ష‌ణాల‌ను చూపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Vitamins  and their deficiencies and symptoms
Vitamins

1. విట‌మిన్ ఎ లోపిస్తే కంటి చూపు మంద‌గిస్తుంది. త‌క్కువ కాంతిలో ఏమీ చూడ‌లేరు. చ‌ర్మంపై దుర‌ద‌లు వ‌స్తుంటాయి. ద‌ద్దుర్లు ఏర్ప‌డుతుంటాయి. క‌ళ్లు పొడిగా మారుతాయి. దుర‌ద‌లు పెడ‌తాయి.

2. విట‌మిన్లు బి2, బి6 లోపిస్తే నోట్లో పుండ్లు ఏర్ప‌డుతాయి. నోట్లో నాలుక మీద ప‌గిలిన‌ట్లు అవుతుంది. చుండ్రు బాగా వ‌స్తుంది. జుట్టు కుదుళ్ల మీద చుండ్రు పేరుకుపోతుంది. త‌లలో దుర‌ద పెడుతుంది.

3. విట‌మిన్ బి7 లోపిస్తే గోళ్లు చిట్లిపోతాయి. సుల‌భంగా విరుగుతాయి. అల‌స‌ట బాగా ఉంటుంది. కండ‌రాల నొప్పులు ఉంటాయి. రాత్రి పూట కాలి పిక్క‌లు ప‌ట్టేస్తాయి. కాళ్లు, చేతుల్లో సూదుల‌తో గుచ్చిన‌ట్లు అవుతుంది.

4. విట‌మిన్ బి12 లోపిస్తే త‌ర‌చూ త‌ల‌నొప్పి వ‌స్తుంటుంది. చ‌ర్మం ప‌సుపు లేదా తెలుపు రంగులోకి మారుతుంది. నోట్లో పగుళ్లు వ‌స్తాయి. వాపులు ఏర్ప‌డుతాయి. డిప్రెష‌న్‌, ఒత్తిడి, ఆందోళ‌న ఉంటాయి. తీవ్ర‌మైన అల‌స‌ట ఉంటుంది.

5. విట‌మిన్ సి లోపిస్తే చిగుళ్ల నుంచి ర‌క్త‌స్రావం అవుతుంది. గాయాలు ఆల‌స్యంగా మానుతాయి. జుట్టు పొడిగా మారుతుంది. చ‌ర్మం పొడిగా మారి దుర‌ద‌లు పెడుతుంది. ముక్కు నుంచి ర‌క్త‌స్రావం అవుతుంది. పాదాలు ప‌గులుతాయి.

6. విట‌మిన్ ఇ లోపిస్తే రోగ నిరోధ‌క శ‌క్తి త‌గ్గుతుంది. పాదాలు, చేతుల్లో స్ప‌ర్శ ఉండ‌దు. శ‌రీర భాగాలు వాటిక‌వే క‌దులుతుంటాయి. నియంత్ర‌ణ‌ను కోల్పోతాయి. కండ‌రాలు బ‌ల‌హీనంగా మారి శ‌క్తిని కోల్పోతారు. కంటి చూపు మంద‌గిస్తుంది.

7. విట‌మిన్ డి లోపిస్తే రోగ నిరోధ‌క శ‌క్తి త‌గ్గుతుంది. ఎముక‌లు, దంతాలు బ‌ల‌హీనంగా మారుతాయి. త్వ‌ర‌గా విరిగిపోయే అవ‌కాశాలు ఉంటాయి. ఎముక‌లు నొప్పిగా ఉంటాయి. తీవ్ర‌మైన అల‌స‌ట ఏర్ప‌డుతుంది. మూడ్ మారుతుంది. డిప్రెషన్‌లోకి వెళ్లిపోతారు. షుగ‌ర్ లెవ‌ల్స్ పెరుగుతాయి. వ్యాధులు, ఇన్‌ఫెక్ష‌న్లు త్వ‌ర‌గా వ‌స్తుంటాయి.

8. విట‌మిన్ కె లోపిస్తే గాయాలు అయిన‌ప్పుడు ర‌క్త స్రావం ఆగ‌దు. అవుతూనే ఉంటుంది. ర‌క్తం త్వ‌ర‌గా గ‌డ్డ‌క‌ట్ట‌దు. ఫ‌లితంగా ర‌క్తం ఎక్కువ‌గా పోతుంది. గాయాలు, పుండ్లు త్వ‌ర‌గా మాన‌వు. వాంతులు అయిన‌ప్పుడు లేదా ముక్కు నుంచి ర‌క్తం ప‌డుతుంది.

ఈ ల‌క్ష‌ణాలు ఎవ‌రిలో అయినా ఉంటే ఆ విట‌మిన్ లోపం ఉన్న‌ట్లు గుర్తించాలి. వెంట‌నే ఆయా విట‌మిన్లు ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి. దీంతో వాటి లోపం నుంచి బ‌య‌ట ప‌డ‌తారు. త‌రువాత ఆయా ల‌క్ష‌ణాలు కూడా కనిపించ‌వు.

Share
Admin

Recent Posts