information

ఏటీఎంలో డ‌బ్బు డ్రా చేయ‌డ‌మే కాదు, ఈ ప‌నులు చేసుకోవ‌చ్చు..!

ఏటీఎం అంటే ఆటోమేటెడ్ టెల్ల‌ర్ మెషీన్. ఇది ఇప్పుడు దాదాపు ప్ర‌తి ఒక్కరి చేతుల్లో ఉంటుంది. ఒక‌ప్పుడు డ‌బ్బుల కోసం బ్యాంకులకి వెళ్లి గంట‌ల త‌ర‌బ‌డి లైన్‌లో ఉండాల్సి వ‌చ్చేది. కాని ఏటీఎంలు వ‌చ్చాక ఆ ప‌ని సులువైంది. ఏటీఎమ్‌ నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకోవాలంటే తప్పనిసరిగా ఏటీఎమ్‌ కార్డు లేదా డెబిట్ కార్డ్‌ని కలిగి ఉండాలి. ఈ కార్డును ఉపయోగించి నగదు డ్రా చేసుకోవచ్చు అలాగే ఏటీఎమ్‌ ద్వారా నగదు విత్‌డ్రా చేయడంతో పాటు బ్యాంకు బ్యాలెన్స్‌ కూడా చెక్‌ చేసుకుంటారు. ఐతే చాలా మంది ఏటీఎమ్‌ మెషీన్‌ని డబ్బు విత్‌డ్రా చేయడానికి మాత్రమే ఉపయోగిస్తారని అనుకుంటారు. ఈ మెషీన్ నుంచి డబ్బును విత్‌డ్రా చేయడమే కాకుండా మ‌రి కొన్ని ప‌నులు కూడా చేసుకునే అవ‌కాశం ఉంది.

మీరు ఏటీఎం ద్వారా ఒక డెబిట్ కార్డ్ నుంచి మరొక డెబిట్ కార్డ్‌కి నేరుగా డబ్బును బదిలీ చేసే సదుపాయాన్ని పొందుతారు. ఈ విధంగా, ఈ ‘కార్డ్ 2 కార్డ్’ బదిలీ సహాయంతో, బ్యాంకు శాఖకు వెళ్లకుండానే ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు డబ్బును పంపవచ్చు. ఎస్‌బీఐకి చెందిన ఏటీఎంలలో ఇటువంటి బదిలీల పరిమితి రూ.40,000 వరకు ఉంటుంది. ఇక మీరు క్రెడిట్ కార్డ్ బిల్లు కూడా ఏటీఎం మెషీన్ ద్వారా చెల్లించ‌వ‌చ్చు. వీసా కార్డ్ కంపెనీ పేపర్‌లెస్ చెల్లింపును ప్రోత్సహించడానికి చాలా బ్యాంకుల ఏటీఎంలలో ఈ సదుపాయం అందించింది. మీరు ఏటీఎం మెషీన్‌లో మీ జీవిత బీమా ప్రీమియం కూడా చెల్లించుకునే అవ‌కాశం ఉంది. ఎల్‌ఐసితో పాటు, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, ఎస్‌బిఐ లైఫ్‌ల బీమా వాయిదాలను ఎటిఎమ్ మెషీన్ నుంచి చేసుకోవ‌చ్చు.

we can also do these works in atm

అలానే మీ చెక్ బుక్ అయిపోతే ఏటీఎం మెషీన్‌లో ‘చెక్ బుక్ రిక్వెస్ట్’ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కరెంటు బిల్లు ఏటీఎం మెషీన్‌లోనే చెల్లించవచ్చు. దేశంలోని చాలా రాష్ట్రాల ఎలక్ట్రిసిటీ బోర్డులు బ్యాంకుల ఏటీఎం మెషీన్లలో తమ జాబితాను నమోదు చేసుకున్నాయి. మీరు మీ బ్యాంక్ ఖాతాకు సంబంధించిన అన్ని అప్‌డేట్‌లను మీ మొబైల్‌లో పొందాలనుకుంటున్నట్లయితే ఈ సదుపాయం కూడా పొందవచ్చు. మీ ఫోన్‌లో ఈ సేవను యాక్టివేట్ చేయడానికి మీరు ఏటీఎం మెషీన్ సహాయం తీసుకోవచ్చు. మీ ఏటీఎం కార్డ్ పాస్ వ‌ర్డ్ పిన్‌ని ఆన్‌లైన్‌లో మార్చుకోవ‌చ్చు. అలానే ఏటీఎంకి వెళ్ళినట్లయితే ఇక్కడ కూడా మీరు ఈ పనిని చాలా బాగా చేయవచ్చు.‘కార్డ్ 2 కార్డ్’ బదిలీ కాకుండా మీరు ఏటీఎం మెషీన్ నుంచి నేరుగా మీ ఖాతాకు డబ్బును బదిలీ చేయవచ్చు. దీని కోసం మీరు డబ్బు, పొదుపు లేదా కరెంట్‌ను బదిలీ చేయాలనుకుంటున్న ఖాతా నంబర్‌ను తెలుసుకోవాలి. ఏటీఎం మిషన్‌ ద్వారా రా మొబైల్ బ్యాంకింగ్‌ సేవలు కూడా పొందవచ్చు. అంతేకాకుండా మీ యుటిలిటీ బిల్లులను కూడా చెల్లించవచ్చు. నేటి కాలంలో చాలా మంది నగదు చెల్లింపులకు UPIని ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే.

Sam

Recent Posts