ఆధ్యాత్మికం

Combing Hair : రాత్రి పూట శిరోజాల‌ను దువ్వ‌కూడ‌దు.. ఎందుకో తెలుసా..?

Combing Hair : మనం కొన్ని నియమాలని కచ్చితంగా పాటించాలి. పూర్వీకులు మనకి చెప్పిన వాటిని మనం తేలికగా తీసి పారేయకూడదు. పెద్దవాళ్ళ చెప్పిన మాటల‌ను కచ్చితంగా అనుసరించాలి. ఎందుకంటే దాని వెనుక ఏదో అర్థం ఉంటుంది. సూర్యాస్తమయం సమయంలో కొన్ని పొరపాట్లని అసలు చేయకూడదు. సూర్యస్తమయం అయిన తర్వాత ఇల్లు తుడవకూడదని, గోళ్లు కత్తిరించుకోకూడదని, తలను దువ్వుకోకూడదని చెప్తూ ఉంటారు. అయితే, ఎందుకు మనం సూర్యాస్తమయం సమయంలో, కురులని విరబోసుకోకూడదు..? ఎందుకు దువ్వుకోకూడదు అనే విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం.

సూర్యాస్తమయం సమయంలో తల దువ్వుకోకూడదని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. సూర్యాస్తమయం అయిన తర్వాత తలని అసలు విప్పకూడదట. సూర్యాస్తమయం తర్వాత కురులని ముట్టుకోకూడదు అని కూడా అంటూ ఉంటారు. చెడు శక్తులు బయట సంచరిస్తూ ఉంటాయి. కాబట్టి సూర్యాస్తమయం అయిన తర్వాత తల దువ్వుకోకూడదు. చెడు శక్తులకి శక్తి ఎక్కువ ఉంటుంది. అందమైన పొడవాటి కురులని కలిగిన మహిళల్ని అవి లక్ష్యంగా పెట్టుకుని వస్తాయట. అందుకని అస్సలు తల దువ్వుకోకూడదు. గట్టిగా జడ వేసుకుని మహిళలు ఉండాలి.

we should not comb our hair at night know why

పూజ చేసే సమయంలో మహిళలు కురులు విప్పుకొని ఉండకూడదు. మహిళలు జుట్టు విప్పుకుంటే చెడు శకునం అంటారు. అలానే ఒక్కొక్కసారి జుట్టు రాలిపోతూ ఉంటుంది. అది ఎక్కడ పడితే అక్కడ పారేయకూడదు. ఎందుకంటే చెడు ఉద్దేశం ఉన్న వ్యక్తుల చేతిలో ఆ జుట్టు పడితే దుష్టశక్తులకి బలవుతారు. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ జుట్టుని పారేయకూడదు.

పౌర్ణమినాడు రాత్రిళ్ళు కురులను దువ్వుకోకూడదు. పౌర్ణమి నాడు రాత్రిళ్ళు కిటికీ పక్కగా నిలుచుని కురులని దువ్వుకుంటే చెడు శక్తులు ఆవహిస్తాయి. నెలసరి సమయంలో మొదటి రోజు చాలా మంది తలస్నానం చేస్తూ ఉంటారు. అలా కూడా చేయకూడదు. అలా చేస్తే పిచ్చెక్కిపోతుందని పెద్దలంటుంటారు. కానీ అలా స్నానం చేయడం వలన అధిక రక్తాన్ని కోల్పోతుంటారు. దానితో నీరసం అయిపోతారు. అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎక్కడ పడితే అక్కడ జుట్టు ఇంట్లో ఉంటే ఇంట్లో వాళ్ల మధ్య గొడవలు కలుగుతాయట. క‌నుక ఈ త‌ప్పుల‌ను అస‌లు చేయ‌కండి.

Admin

Recent Posts