ఆధ్యాత్మికం

Lord Ganesha : వినాయ‌కుడి విగ్ర‌హాన్ని ఏ దిక్కున పెట్టాలి..?

Lord Ganesha : ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా దేవుడి విగ్రహాలు ఉంటాయి. వాటిని మనం పూజ మందిరంలో పెడుతూ ఉంటాము. అలాగే గోడలకి దేవుళ్ళ ఫోటోలని పెడుతూ ఉంటాము. ఎవరికి ఇష్టమైన దేవుళ్ళ ఫోటోల‌ను వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరి ఇంట్లో క‌చ్చితంగా గణపతి ఫోటో ఉంటుంది. గణపతి విగ్రహాలు కూడా ఉంటాయి. అయితే గణపతి విగ్రహాలని ఏ దిశలో పెడితే మంచిది, ఏ దిశలో పెట్టకూడదు వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

గణపతిని కచ్చితంగా మొట్టమొదట పూజించాలి. వినాయకుడిని మొట్ట మొదట పూజించడం వలన సమస్యలు, ఆటంకాలు అన్నీ తొలగిపోతాయి. మనం చేసే పనిలో ఆటంకం కలగకుండా మన పని పూర్తవుతుంది. వినాయకుడిని పూజిస్తే సంపద, ఆనందం, అదృష్టం కలుగుతాయి. తెల్ల వినాయకుడిని ఇంట్లో పెట్టుకోవడం వలన జీవితంలో పెద్ద మార్పు కలుగుతుంది. గణేష్ విగ్రహాన్ని ఇంట్లో తూర్పు లేదా పడమర దిశలో పెట్టుకోవచ్చు.

which side we have to put lord ganesha idol

ఇలా పెడితే ఇంటికి మంచి జరుగుతుంది. దక్షిణం వైపు ఎప్పుడూ పెట్టకండి. బాత్రూంకి అటాచ్ చేసిన గోడ దగ్గర పెట్టకూడదు. అలా చేస్తే నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. మెట్ల‌ కింద ఎప్పుడూ వినాయకుడి బొమ్మని పెట్టకూడదు. పడకగదిలో పెట్టడం మంచిది కాదు. ఒక వేళ పెట్టాలని మీరు అనుకుంటే ఈశాన్యం మూలలో పెట్టుకోవచ్చు.

పడుకునేటప్పుడు మీ కాళ్ళని అటువైపు లేకుండా చూసుకోండి. మామిడి, గంధం, వేప చెక్కతో చేసిన వినాయకుడి విగ్రహాలని ఇంట్లో పెట్టుకోవడం వలన అదృష్టం కలుగుతుంది. స్ఫ‌టిక వినాయకుడు ఇంట్లో ఉంటే కూడా మంచిదే. మీ జీవితంలో చక్కటి మార్పు వస్తుంది. జీవితంలో ఇబ్బందులు తొలగిపోవడానికి పసుపుతో చేసిన వినాయకుడిని పెట్టుకోండి. సొంతంగా గణేశుడి విగ్రహాన్ని కాగితాలతో చేసి కూడా పూజించుకోవచ్చు.

Admin

Recent Posts