Birth Star : మనం పుట్టిన నక్షత్రాన్ని బట్టి మన జాతకాన్ని చూస్తారు. పెళ్లి వంటి వాటికి ముహూర్తాలని పెట్టేటప్పుడు కూడా నక్షత్రాన్ని చూస్తూ ఉంటారు. ఇలా మనం పుట్టిన నక్షాత్రాలు ఎంతో ముఖ్యము. అయితే పుట్టిన నక్షత్రం బట్టి వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది ఈరోజు తెలుసుకుందాము. అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో అశ్విని నక్షత్రంలో జన్మించిన వాళ్ళు అధికారులు అవుతారు.
భరణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు సుఖవంతులు. కృత్తిక నక్షత్రంలో పుట్టిన వాళ్ళు తేజవంతులు. రోహిణి నక్షత్రంలో పుట్టిన వాళ్లయితే చక్కటి దాంపత్యం కలిగి ఉంటారు. అన్యోన్యమైన సుఖ సంసారాన్ని మృగశిర నక్షత్రం వాళ్ళు పొందుతారు. అలానే పునర్వసు నక్షత్రం కలిగిన వాళ్లు దుఃఖమైన జీవితాన్ని గడుపుతారు. పుష్యమి నక్షత్రం వారి కుటుంబానికి వేదన ఉంటుంది.
ఆశ్లేష నక్షత్రం వాళ్ళు సకల శుభములను కలిగి ఉంటారు. మఖ నక్షత్రం వాళ్లు భర్తకి దూరమవుతారు. పుబ్బ నక్షత్రం వారికి మగ సంతానం ఉంటుంది. ఫాల్గుణ నక్షత్రం వాళ్లకి బాగా చూసుకునే పుత్రుడు కలుగుతాడు. హస్త నక్షత్రం వాళ్ళకి అఖండ అదృష్టం ఉంటుంది. చిత్తా నక్షత్రం వాళ్లు చక్కటి జీవితాన్ని గడుపుతారు. స్వాతి నక్షత్రం వాళ్లు జీవిత భాగస్వామి ప్రేమని అపారంగా పొందుతారు.
విశాఖ నక్షత్రం వాళ్లకి అయితే నలుగురు ఈర్ష్య పడే దాంపత్యం ఉంటుంది. అనురాధ నక్షత్రం వాళ్లు రోగాలను ఎదుర్కొంటారు. జేష్ట నక్షత్రం వాళ్ళకి ధన నష్టం ఉంటుంది. ఈతి బాధలు ఆరోగ్య సమస్యలు మూల నక్షత్రం వాళ్లకి ఉంటాయి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళ కుటుంబానికి ఆవేదన తప్పదు. సంతోషంగా ఉత్తరాషాడ నక్షత్రం వాళ్ళు జీవిస్తారు.