స్త్రీలు కొన్ని పొరపాట్లు చేయడం వలన ఇంటికి దరిద్రం పట్టుకుంటుంది. ఇంటికి అశుభాన్ని కలిగిస్తుంది. మంచి కలగదు. అయితే మరి స్త్రీలు ఎలాంటి పొరపాట్లను చేయకూడదు..? ఎటువంటి తప్పులు చేస్తే, ఇబ్బందులు ఎదుర్కోవాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. భర్త, పిల్లలు మంగళవారం నాడు క్షవరము, గడ్డం గీసుకోకుండా స్త్రీలు చూసుకోవాలి.
ఒకవేళ కనుక తప్పు అని చెప్పకపోతే దరిద్రం సంభవిస్తుంది. కాబట్టి ఈ పొరపాటు స్త్రీలు చేయకుండా చూసుకోండి. స్త్రీలు రాత్రి పూట గాజులు, కమ్మలు తొలగించకూడదు. ఇలా చేయడం వలన అస్సలు మంచి కలగదు. ఇలా చేయడం వలన సమస్యలు కలుగుతాయి. ఉప్పు, మిరపకాయలు, చింతపండు ఎవరి చేతికి ఇవ్వకూడదు. కింద పెట్టి తీసుకోమని చెప్పాలి. ఈ పొరపాటు కూడా చేయకూడదు.
నలుపు రంగు బట్టలు స్త్రీలు వేసుకోకూడదు. ఎక్కడైనా దుఃఖము, బాధ, విచారము ఉన్నట్లయితే అక్కడికి వెళ్లి ఎవరినీ ఆహ్వానించకూడదు. అలానే వెళ్ళిపోయేటప్పుడు వెళ్లి వస్తున్నానని చెప్పకూడదు. ప్రతిరోజు భోజనం తినే ముందు కాకికి అన్నం పెట్టాలి. అలా పెట్టడం వలన పితృదేవతలకి సంతోషం కలుగుతుంది. అలానే మనం భోజనం చేశాక ఆహారాన్ని కుక్కకి పెట్టాలి. కుక్కల్ని ఎప్పుడూ కన్న సంతానం కంటే ఎక్కువగా లాలిస్తూ ఉండాలి.
స్త్రీలు ఎప్పుడూ జుట్టు విరబోసుకుని ఉండకూడదు. జేష్టా దేవి స్వరూపం ఇది. ఇంటిలో అమంగళము జరగడం, ఆటంకాలు కలగడం వంటివి జరుగుతాయి. శుక్రవారం నాడు కానీ జీతం రాగానే కానీ ముందు ఆ డబ్బుతో ఉప్పుని కొనండి. ఇలా చేయడం వలన మీ ఇంట్లో డబ్బు నిలుస్తుంది. శ్రాద్ధ దినం రోజు కార్యక్రమము పూర్తయ్యే వరకు ఇంటి ముందు ముగ్గు వేయకూడదు. అది పూర్తయిన తర్వాత ముగ్గు వేసి, తర్వాత ఇంట్లో వాళ్ళు భోజనం చేయాలి.