ఆధ్యాత్మికం

Zodiac Signs And Gods : ఏ రాశి వారు ఏ దైవాన్ని పూజించాలో తెలుసా..?

Zodiac Signs And Gods : మనకి మొత్తం 12 రాశులు. రాశులను బట్టి మనం మన భవిష్యత్తు ఎలా ఉంది అనేది తెలుసుకోవచ్చు. దానితో పాటుగా ఏ రాశి వాళ్ళు ఏం చేస్తే ఎలాంటి ఫలితాలని పొందొచ్చు అనేది కూడా తెలుసుకోవచ్చు. అయితే ఈరోజు ఏ రాశి వాళ్ళు ఏ దైవాన్ని పూజించాలి అనే విషయాన్ని చూద్దాం. మామూలుగా ప్రతి ఒక్కరు కూడా పూజలను చేస్తూ ఉంటారు. కానీ రోజూ పూజ చేసేలా కాకుండా నక్షత్రము, రాశి ప్రభావాన్ని అనుసరించి ఆయా దేవతలకి ప్రీతి కలిగే విధంగా పూజలు చేస్తే శుభ ఫలితాలను పొందొచ్చు. మరి ఇక వాటి వివరాలు చూసేద్దాం.

మేష రాశి వాళ్లు సూర్యుడిని పూజిస్తే మంచిది. సూర్యుడు మేషరాశిలో అత్యున్నత స్థానంగా పరిగణిస్తారు. సూర్యుడిని కనుక మేషరాశి వాళ్ళు పూజిస్తే సంపద ఆరోగ్యం కలుగుతుంది. విజయం వారి సొంతమవుతుంది. రాముడుని కూడా పూజ చేస్తే మంచిది. ఈ రాశి వాళ్లు సూర్య మంత్రాన్ని ప్రతిరోజు జపిస్తే మంచిది. వృషభ రాశి వారు చంద్రుడు ని పూజిస్తే మంచిది. సోమవారం కానీ శుక్రవారం నాడు కానీ పూజించి ఉపవాసం ఉండాలి. ఓం సోమ సోమాయ నమః మంత్రాన్ని చదివి ప్రతిరోజు జపించడం వలన అంతా మంచే జరుగుతుంది. అలానే వృషభ రాశి వాళ్ళు పేదలకి తెల్లని బట్టల్ని దానం చేస్తే కూడా మంచి జరుగుతుంది.

మిధున రాశి వాళ్లు లక్ష్మీదేవిని పూజిస్తే మంచిది. ‘శ్రీ’ అని జపిస్తూ ఉంటే మంచి ఫలితాలను పొందొచ్చు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. కర్కాటక రాశి వారు హనుమంతుడిని పూజించాలి, ఆరోగ్యం ధైర్యం కలుగుతాయి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా ని పఠించాలి. శ్రీకృష్ణుడిని సరస్వతి దేవిని కూడా పూజించవచ్చు. కన్యా రాశి వాళ్లు కాళీ దేవుని పూజిస్తే మంచిది. ఆరోగ్యం సంపద కలుగుతాయి. హనుమంతుడిని కాళీమాతని పూజిస్తే ఈ రాశి వాళ్ళకి తిరుగు ఉండదు.

which zodiac sign persons have to pray which god

సింహ రాశి వాళ్ళు శివుడిని కొలిస్తే మంచిది. ‘ఓం నమశ్శివాయ’ అని జపిస్తూ ప్రతిరోజు శివలింగానికి నీళ్లు పాలు సమర్పించండి. తులారాశి వాళ్ళు పార్వతీదేవిని పూజిస్తే మంచిది. పార్వతి దేవి తో పాటుగా గణేషుడుని కూడా ఆరాధించండి. విజయాలని అందుకుంటారు. ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. వృశ్చిక రాశి వాళ్లు గణపతిని పూజిస్తే మంచిది. గణపతిని హనుమంతుడిని పూజిస్తే ఈ రాశి వారికి తిరుగు ఉండదు. అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి.

ధనస్సు రాశి వాళ్ళు విష్ణుమూర్తిని పూజిస్తే చక్కటి ఫలితాన్ని పొందవచ్చు. ఓం నమో నారాయణ అని జపిస్తే మకర రాశి వాళ్ళు సరస్వతి దేవిని పూజిస్తే మంచిది. మకర రాశి వారు సరస్వతి దేవిని పూజిస్తే విజయాలని అందుకుంటారు. కీర్తి లభిస్తుంది. కుంభ రాశి వాళ్ళు శని, గణేశుడిని పూజిస్తే మంచిది, ఉద్యోగంలో కానీ లేదంటే ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ శనిని గణేశుడిని పూజించండి. శని మంత్రాన్ని జపించండి. మీన రాశి వాళ్లు దుర్గా దేవిని పూజిస్తే మంచి జరుగుతుంది. సంతోషంగా ఉండొచ్చు. అదృష్టం కలిసి వస్తుంది విజయాన్ని అందుకుంటారు.

Admin

Recent Posts