హెల్త్ టిప్స్

Eating Spicy Food : కారం తిన్నాక నోరు మండితే.. వెంటనే చక్కెర తినేస్తాం.. ఇలా చేయడం మంచిదేనా..?

Eating Spicy Food : జిహ్వకో రుచి అన్న చందంగా ఈ ప్ర‌పంచంలోని వ్య‌క్తులంద‌రూ భిన్న‌మైన రుచుల‌ను కలిగి ఉంటారు. ఆ రుచులంటేనే వారు ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తారు. ప్ర‌ధానంగా జ‌నాలు ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డే రుచుల్లో చెప్పుకోద‌గిన‌వి రెండు. అవి తీపి, కారం. చాలా మందికి ఇవి అంటేనే ఎక్కువ‌గా ఇష్టంగా ఉంటాయి. అయితే తీపి సంగ‌తి ప‌క్క‌న పెడితే కారంను కూడా చాలా మందే తింటారు. కానీ కారంను ఇష్టంగా తినే వారు అంత‌గా మంట‌ను ఫీల్ అవ్వ‌రు. ఇక తిన‌క తిన‌క ఒక్క‌సారి కారం తింటే అలాంటి వారి ప‌రిస్థితి ఎలా ఉంటుందో మ‌నం అర్థం చేసుకోవ‌చ్చు. నాలుకంతా మంట‌గా మార‌డంతో మిర‌ప‌కాయ తిన్న కాకిలా మారిపోతారు.

నోరంతా ఊ.. అని ఉసికొడుతుంటారు. అలాంటి వారు వెంటనే వెళ్లి గుప్పెడంత చక్కెరను నోట్లో వేసుకుంటారు. అయితే కారంతో నోరు మంటగా ఉన్నప్పుడు చక్కెర ను తినడం అంత శ్రేయస్కరం కాదు. చక్కెరకు బదులుగా ఈ పదార్థాలు తింటే కారం మంట తగ్గడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బాగా కారంగా ఉన్న ప‌దార్థాల‌ను తిన‌డం వ‌ల్ల నోరంతా మంట‌గా మారితే వెంట‌నే ఒక గ్లాస్ పాలు తాగేయండి. దీంతో మంట త‌గ్గుతుంది. పాల‌ల్లో ఉండే కేసీన్ నాలుక‌పై ఏర్ప‌డే మంట‌ను త‌గ్గిస్తుంది. బ్రెడ్‌, అన్నం, ఉడికిన ఆలుగ‌డ్డ‌లు వంటి పిండి ప‌దార్థాలు అధికంగా ఉన్న ఆహారాన్ని నోట్లో వేసుకుని న‌మిలి మింగాలి. దీని వ‌ల్ల నాలుక మంట త‌గ్గుతుంది.

what to do after eating spicy food

ఒక నిమ్మ‌కాయ‌ను తీసి అడ్డంగా కోసి ఆ ముక్క‌ను నోట్లో పిండుకోవాలి. దాన్నుంచి వ‌చ్చే ర‌సం నాలుక మంట‌ను త‌గ్గిస్తుంది. ఒక టీస్పూన్ తేనెను నోట్లో వేసుకుని కొంత సేపు అలాగే ఉంచి అనంత‌రం ఆ తేనెను మింగేయాలి. దీంతో నాలుక‌, నోట్లో ఉన్న కారం మంట త‌గ్గుతుంది. పీన‌ట్ బ‌ట‌ర్‌ను నోట్లో వేసుకున్నా కారం మంట నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. కారం వ‌ల్ల విడుద‌ల‌య్యే కెమిక‌ల్స్ ప్ర‌భావాన్ని పీన‌ట్ బ‌ట‌ర్ త‌గ్గిస్తుంది. అవ‌కాడో, అర‌టి పండును ఒక్కోదాన్ని తీసుకుని వాటిని బాగా న‌లిపి నోట్లో వేసుకుని న‌మ‌లాలి. దీంతో కారం బాధ త‌గ్గుతుంది. వేరే వస్తువులు ఏవీ అందుబాటులో లేనప్పుడు తప్పని పరిస్థితుల్లో చక్కెరను తినొచ్చు. అయితే చ‌క్కెర‌ను వెంట‌నే న‌మిలి మింగేయ‌కూడ‌దు. కొంత సేపు నోట్లో అలాగే ఉంచుకోవాలి. ఆ త‌రువాత న‌మిలి మింగాలి. దీంతో కారం మంట త‌గ్గుతుంది.

Admin

Recent Posts