లడ్డు ముత్య ఎవరు..? లడ్డు ముత్య గురించి అందరూ చర్చించుకుంటున్నారు. తాజాగా సోషల్ మీడియాలో కూడా ఆయన రీల్స్ వైరల్ అవుతున్నాయి. సాధారణంగా మన ఇంస్టాగ్రామ్ చూసినట్లయితే అనేక రీల్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. వింతలు వంటివి కూడా మనం ఇన్స్టాగ్రామ్ లో చూడొచ్చు. ఇంస్టాగ్రామ్ తో సహా పలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ఒక బాబాకి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఆయన హాట్ టాపిక్ అయిపోయారు.
లడ్డు ముత్య పాటతో బ్యాక్గ్రౌండ్ నడుస్తోంది. ఈ క్లిప్స్ సోషల్ మీడియాలో విపరీతంగా షికార్లు కొడుతున్నాయి. అసలు లడ్డు ముత్య ఎవరు అని ఆయన గురించి అందరూ గూగుల్ లో వెతకడం మొదలుపెట్టారు. తిరుగుతున్న ఫ్యాన్ ని ఆయన చేతులతో ఆపేశారు. తర్వాత దుమ్ముని భక్తుల నుదుటిపై రాశారు. ఈ వీడియోలో ఇవన్నీ మనం చూడొచ్చు. అలాగే వెనకాల లడ్డు ముత్య అనే పాట ప్లే అవుతోంది.
పలు నెటిజన్స్ ఈ ఫ్యాన్ బాబా ని ఇమిటేట్ చేస్తున్నారు. అయితే కొన్ని రిపోర్ట్ల ప్రకారం చూసినట్లయితే.. లడ్డు ముత్య అనేది స్పెషల్లీ ఏబుల్డ్ పిల్లవాడు. 20 ఏళ్ల పాటు ఎన్నో కష్టాలని ఎదుర్కొన్నారు. ఆయన ఇంటి నుంచి వచ్చేసారని, పెళ్లి కూడా చేసుకోలేదని పలువురు చెప్తున్నారు. భిక్ష స్వీకరిస్తూ ఇలా జీవితాన్ని గడపడం మొదలుపెట్టారట. ఆయన ఒక కొట్టుకు వెళ్ళినప్పుడు అక్కడ వ్యాపారం బాగా సాగిందట. అలాగే ఒకరి ఇంటికి వెళ్తే కూడా వాళ్ళు ధనవంతులయ్యారట. ఆయనకి పవర్స్ ఉన్నాయని చాలా మంది నమ్ముతారు.