ప్రపంచ వ్యాప్తంగా భూమిపై అనేక వృక్ష జాతులు ఉన్నాయి. ఒక్కో చోట మనకు భిన్న రకాల వృక్షాలు కనిపిస్తుంటాయి. కొన్ని ఆయుర్వేద పరంగా మనకు ఔషధాలుగా పనిచేస్తాయి. కొన్ని అత్యంత విషపూరితంగా ఉంటాయి. ఇక కొన్ని వృక్షాలకు చెందిన కలపను మనం ఎక్కువగా ఉపయోగిస్తాం. ఈ క్రమంలోనే కలప విషయానికి వస్తే అత్యంత ఖరీదైన కలపను ఇచ్చే వృక్ష జాతి కూడా ఒకటుంది. అదేమిటంటే..
ఆఫ్రికన్ బ్లాక్‌వుడ్ అనే జాతికి చెందిన వృక్షాల కలప అత్యంత ఖరీదైంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కలపగా ఇది పేరు గాంచింది. ఈ వృక్షాలకు చెందిన కలప కేజీకి సుమారుగా రూ.7 లక్షల వరకు ఉంటుంది. అంటే.. ఇది ఖరీదు ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
ఇక ఆఫ్రికన్ బ్లాక్‌వుడ్ జాతికి చెందిన వృక్షాల నుంచి కలప వచ్చేందుకు సుమారుగా 50 ఏళ్లకు పైనే పడుతుంది. అన్నేళ్లు గడిస్తేనే కానీ వాటి నుంచి కలప రాదు. అందుకనే ఈ వృక్షాల కలప అత్యంత ఖరీదైందిగా పేరుగాంచింది. ఇక ఈ వృక్షాలు సుమారుగా 50 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. వీటిని ఆఫ్రికాతోపాటు జపాన్, అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో పెంచుతారు. అంతర్జాతీయంగా కూడా ఈ వృక్షాలకు చెందిన కలపకు మంచి డిమాండ్ ఉంది. ఈ వృక్షాలకు చెందిన కలపతో తయారు చేసిన వస్తువులకు కూడా అధిక ధర ఉంటుంది.