సాధారణంగా మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవుడిని దర్శనం చేసుకున్న తర్వాత పురోహితులు తీర్థం ప్రసాదంగా ఇస్తారు. అయితే తీర్థం ఆలయంలో ఒకసారి కాకుండా మూడు సార్లు ఇవ్వడం మనం చూస్తుంటాం. ఈ విధంగా తీర్థం మూడుసార్లు ఇవ్వడానికి గల కారణం ఏమిటో చాలా మందికి తెలియదు. అయితే తీర్థం మూడుసార్లు ఇవ్వడానికి గల కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలయానికి వెళ్ళినప్పుడు పురోహితులు తీర్థం వేసేముందు అకాల మృత్యు హరణం సర్వ వ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ పరమేశ్వర దుర్గా విష్ణు పాదోదకం పావనం అనే మంత్రాన్ని చదువుతూ తీర్థాన్ని వేస్తారు. అకాల మరణాన్ని తప్పించే శక్తి, రోగాలను నివారించే పాపక్షయం కనుక తీర్థం తీసుకునేటప్పుడు మనస్సు భగవంతుడిపై ఉంచి తీర్థం తీసుకోవాలి.
ఇక మొదటిసారి తీర్థం వేసినప్పుడు మానసిక, శారీరక శుద్ధి జరుగుతుంది. రెండవసారి తీర్థ వేసినప్పుడు న్యాయ, ధర్మ ప్రవర్తనలు చక్కబడతాయి. ఇక మూడో సారి తీర్థం తీసుకునేటప్పుడు పరమేశ్వరుడికి పరమ పవిత్రమైన నమస్కారం చేసి తీర్థం తీసుకోవాలని పురోహితులు చెబుతున్నారు.