lifestyle

త‌ల్లి క‌డుపులో ఉన్న బిడ్డ ఎందుకు తంతుందో తెలుసా..?

మొద‌టి సారి త‌ల్లి తండ్రి అవుతున్న దంప‌తులకు ఎంత‌గానో థ్రిల్ అనిపిస్తుంది. వారు పుట్ట‌బోయే త‌మ బిడ్డ కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటారు. ఇక మ‌హిళ‌ల‌కు అయితే మొద‌టి సారి త‌ల్లి అయితే క‌లిగే ఆనంద‌మే వేరు. త‌న‌లో పెరుగుతున్న త‌న చిన్నారి ఎప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తుందా ? ఎప్పుడు త‌న‌తో ఆడుకుందామా ? అని త‌ల్లులు ఎదురు చూస్తారు. మాతృత్వం అనేది మ‌హిళ‌ల‌కు మాత్ర‌మే ల‌భించే గొప్ప వ‌రం. అయితే బిడ్డ క‌డుపులో ఉన్న‌ప్పుడు ఒక్కోసారి త‌న్న‌డం జ‌రుగుతుంది. బిడ్డ క‌ద‌లిక‌లు త‌ల్లికి స్ప‌ష్టంగా తెలుస్తాయి. అయితే ఇలా ఎలా ఎందుకు జ‌రుగుతుందో తెలుసా..?

క‌డుపులో ఉన్న బిడ్డ త‌న్న‌డాన్ని చాలా మంది మ‌హిళ‌లు గొప్ప‌గా భావిస్తారు. అయితే నిజానికి బిడ్డ త‌న్న‌డం అనేది అత్యంత స‌హ‌జ‌మైన ప్ర‌క్రియ‌. గ‌ర్భం దాల్చిన మ‌హిళ‌కు 20-30 వారాల గ‌ర్భం స‌మ‌యంలో బిడ్డ త‌న్న‌డం జ‌రుగుతుంది. 35 వారానికి ఆ ప్ర‌క్రియ ఆగుతుంది. బిడ్డ‌కు ఆ స‌మయంలో ఎముక‌లు పెరుగుతుంటాయి. కీళ్ల‌లో మార్పులు వ‌స్తాయి. అందుక‌నే బిడ్డ క‌డుపులో అటు తిరుగుతూ త‌న్న‌డం జ‌రుగుతుంది. మ‌నం కొద్ది సేపు కూర్చుంటేనే కాళ్ల‌ను చాపాల‌నిపిస్తుంది. క‌డుపులో ఉన్న బిడ్డ‌కు కూడా అంతే. అలా త‌న్నుతుంటేనే సౌక‌ర్య‌వంతంగా ఉంటుంది. అందుకే వారు అలా చేస్తారు.

why baby kicks in womb

అయితే క‌డుపులో ఉన్న బిడ్డ ఎంత ఎక్కువ త‌న్నితే వారు అంత ఆరోగ్యంగా ఉంటార‌ట‌. అలా అని సైంటిస్టులే చెబుతున్నారు. ఈ మేర‌కు కొంద‌రు సైంటిస్టులు అధ్య‌య‌నాలు కూడా చేప‌ట్టారు. క‌డుపులో బాగా త‌న్నేవారికి నాడీ మండ‌ల సంబంధిత స‌మ‌స్య‌లు రావ‌ని, వారు ఆరోగ్యంగా ఉంటార‌ని చెబుతున్నారు. క‌నుక క‌డుపులో ఉన్న బిడ్డ తంతుంటే వారు చాలా ఆరోగ్యంగా ఉన్నార‌ని అర్థం చేసుకోండి.

Admin

Recent Posts