Off Beat

Birds On Electric Wires : క‌రెంటు తీగ‌ల‌పై కూర్చున్నా ప‌క్షుల‌కు షాక్ ఎందుకు కొట్ట‌దు..?

Birds On Electric Wires : కరెంటు అంటే తెలియని వారు ఉండరు. కరెంట్ తీగలు పట్టుకుంటే ఎంత ప్రమాదమో కూడా అందరికీ తెలిసిన విషయమే. కానీ మనం ఎప్పుడైనా గమనిస్తే బయట ఎన్నో పక్షులు కరెంటు తీగలపై కూర్చొని ఉంటాయి. మరి ఆ పక్షులకు కరెంట్ షాక్ ఎందుకు కొట్టదు.. పక్షులకు, మనుషులకు ఉన్న తేడా ఏమిటి..? క‌రెంటు షాక్ కొట్ట‌కుండా వాటికి ఏమైనా ప్ర‌త్యేక అమ‌రిక ఉంటుందా..? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా కరెంట్ లో ఫేజ్, న్యూట్రల్ అనేవి ఉంటాయి. వైర్స్ లో విద్యుత్ పాస్ కావాలంటే ఈ రెండు తప్పనిసరిగా ఉండాలి. ఇక రెండవది సర్క్యూట్. ఇందులోంచి కరెంటు పాస్ అవ్వాలంటే ఆ సర్క్యూట్ కంపల్సరిగా క్లోజ్ చేసి ఉండాలి. ఇక మూడవది రెసిస్టెన్స్. అంటే విద్యుత్ నిరోధకం. కరెంటు ఎప్పుడైనా సరే తక్కువ రెసిస్టెన్స్ ను ఉన్న దానిగుండా మాత్రమే ప్రవహిస్తుంది. ఇక పక్షుల విషయానికి వస్తే వాటికి షాక్‌ తగలక పోవడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. ఇందులో మొదటిది పక్షి తన రెండు కాళ్లను ఒకే తీగ పై పెట్టి నిలిచి ఉంటుంది.

why birds did not get electrocuted even if they sit on electric wires

అంటే సర్క్యూట్ క్లోస్ కాలేదు. దీనిలో కరెంట్ పాస్ కాదు. ఒకవేళ పక్షి పొరపాటున తన రెండో కాలుతో కానీ రెక్కతో కానీ పక్కనున్న మరో వైర్ ను తాకితే సర్క్యూట్ క్లోజ్ అయ్యి కరెంటు పక్షి గుండా పాస్ అవుతుంది. అప్పుడు పక్షికి కచ్చితంగా కరెంట్ షాక్ వస్తుంది. ఇక రెండవ కారణం రెసిస్టెన్స్. కరెంటు తీగ పై ఉన్న పక్షి రెసిస్టెన్స్, ఆ వైరు కు ఉన్న రెసిస్టెన్స్ తో పోల్చుకుంటే క‌చ్చితంగా పక్షి రెసిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి క‌రెంటు ఎప్పుడూ తక్కువ రెసిస్టెన్స్ ఉన్న దాని గుండానే ప్రవహిస్తుంది. తక్కువ రెసిస్టెన్స్ ఉండడం వల్ల వైర్ నుంచే క‌రెంటు పాస్ అవుతుంది. కానీ ప‌క్షి నుంచి క‌రెంటు పాస్ అవ‌దు. అందువ‌ల్లే ప‌క్షుల‌కు వైర్ల‌పై కూర్చున్నా క‌రెంట్ షాక్ కొట్ట‌దు. ఇదీ దాని వెనుక ఉన్న అస‌లు విష‌యాలు.

Admin

Recent Posts