వినోదం

Chiranjeevi Navy Uniform Photo : మెగాస్టార్ చిరంజీవికి చెందిన ఈ ఫోటో ఏమిటో.. దీని వెనుక ఉన్న క‌థేమిటో తెలుసా..?

Chiranjeevi Navy Uniform Photo : తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో చిరంజీవి ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే అడుగు పెట్టారు. త‌న యాక్టింగ్‌, డ్యాన్స్‌తో అద‌ర‌గొట్టారు. అంచెలంచెలుగా ఎదిగారు. కోట్లాది మంది అభిమానుల‌ను ఆయ‌న సంపాదించుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న మెగాస్టార్ అయ్యారు. ఇక ప్ర‌స్తుతం చిరంజీవి ఇండ‌స్ట్రీకి పెద్ద దిక్కుగా మారిపోయారు. గతంలో ఇండ‌స్ట్రీ క‌ష్టాల్లో ఉంటే ఇరు రాష్ట్రాల సీఎంల‌తో మాట్లాడి టిక్కెట్ల ధ‌ర‌ల‌ను పెంచుకునేలా చేశారు. దీంతో థియేట‌ర్ల యాజ‌మాన్యాల‌కు భారీగా ఊర‌ట ల‌భించింది. ఇక చిరంజీవి ప్ర‌స్తుతం ఆరు ప‌దుల వ‌య‌స్సులో ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ కుర్ర హీరోల‌కు పోటీగా సినిమాలు చేస్తున్నారు. అయితే చిరంజీవికి చెందిన ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

మెగాస్టార్ చిరంజీవి నేవీ డే సంద‌ర్భంగా త‌న సోష‌ల్ ఖాతాలో ఓ పోస్ట్‌ను పెట్టారు. అందులో ఆయ‌న ఫోటో ఉంది. అది ఆయ‌న త‌న కాలేజీ రోజుల్లో తీసుకున్న‌ది కావ‌డం విశేషం. అందులో ఆయ‌న నేవీ యూనిఫామ్‌లో ఉన్నారు. అయితే అది ఏదైనా సినిమాలోని ఫొటోనా అని చాలా మంది ఆరా తీశారు. కానీ వాస్త‌వానికి ఆ ఫొటో సినిమాలోనిది కాదు. నిజ జీవితంలో తీసుకున్న‌దే. అప్ప‌ట్లో ఆయ‌న ఎన్‌సీసీ క్యాడెట్‌గా ప‌నిచేశారు. ఆ స‌మ‌యంలో తీసిందే ఆ ఫొటో. గోవా ఎయిర్‌పోర్ట్‌లోనూ కొంద‌రు నేవీ అధికారుల‌ను క‌లిసిన చిరంజీవి అప్ప‌ట్లో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌ను గుర్తు చేసుకున్నారు.

why chiranjeevi is in navy uniform what about this photo

ఇక 1976లో రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా అప్ప‌టి ఉమ్మ‌డి ఏపీలో రాజ్ భ‌వ‌న్ లో జ‌రిగిన మార్చ్ ఫాస్ట్‌లోనూ పాల్గొన్న‌ట్లు చిరంజీవి తెలియ‌జేశారు. వైఎన్ఎం కాలేజీకి చెందిన పూర్వ విద్యార్థుల స‌మ్మేళ‌నంలోనూ చిరంజీవి పాల్గొన్నారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న త‌న పాత జ్ఞాప‌కాల‌ను ఒక‌సారి గుర్తు చేసుకున్నారు. అయితే చిరంజీవి నేవీ డ్రెస్‌లో దిగిన ఫొటో ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో తెగ వైర‌ల్ అవుతోంది. దీంతో ఆ ఫొటో స్టోరీ ఏంటి.. అని అంద‌రూ ఆరా తీస్తున్నారు.

Admin

Recent Posts