Home Tips

మనం ఇళ్లలో తయారు చేసే పెరుగు కన్నా హోటళ్లు, రెస్టారెంట్లలో తయారు చేసే పెరుగు గట్టిగా గడ్డ కట్టినట్లు ఉంటుంది.. ఎందుకు..?

మన దేశంలో చాలా మందికి పెరుగు అంటే ఇష్టమే. భోజనం చివర్లో పెరుగన్నం తినకపోతే భోజనం చేసిన భావన కలగదు. ఉత్తరాదివారు పెరుగులో చక్కెర కలుపుకుని తింటారు. దక్షిణాది వారు అన్నంలో పెరుగు కలిపి తింటారు. అయితే పెరుగు నీళ్లలా ఉండే కన్నా గట్టిగా గడ్డ కట్టినట్లు ఉంటేనే చాలా మందికి ఇష్టం. అందుకనే హోటళ్లు, రెస్టారెంట్లలో పెరుగు గడ్డకట్టినట్లు ఉంటుంది. దీని వెనుక ఉండే అసలు కారణం ఏమిటో తెలుసా ?

పాలలో కొవ్వు తీయకుండా పెరుగు తయారు చేస్తే పెరుగు గడ్డ కట్టే అవకాశాలు ఉంటాయి. అలాగే వాతావరణ పరిస్థితులు కూడా పెరుగు గట్టిగా ఉండేందుకు దోహదపడతాయి. కానీ రెస్టారెంట్లలో మాత్రం కొవ్వు తీసిన పాలతోనే పెరుగును గట్టిగా తయారు చేస్తారు. అందుకు గాను వారు అందులో కార్న్‌ ఫ్లోర్, వెనిగర్‌లను కలుపుతారు. అందుకనే రెస్టారెంట్లలో పెరుగు గడ్డ కట్టినట్లు మనకు గట్టిగా కనిపిస్తుంది.

why curd in restaurants very thick

అయితే అలాంటి పెరుగును తినొద్దని చెప్పలేం. కార్న్‌ ఫ్లోర్‌, వెనిగర్‌లు తినదగిన పదార్థాలే. అందువల్ల ఆ పెరుగును తింటే ఎలాంటి హానీ కలగదు. కాకపోతే మనం పెరుగుకు డబ్బులు ఇస్తున్నాం కదా, కానీ రెస్టారెంట్‌ వారు మాత్రం స్వచ్ఛమైన గడ్డ పెరుగును మనకు ఇవ్వరు, అందులో పలు రకాల పదార్థాలను కలిపి తయారు చేసింది ఇస్తారు, కనుక అలాంటి పెరుగును తింటామా ? తినలేం కదా, మనం డబ్బులు ఇచ్చేది స్వచ్ఛమైన పెరుగుకు.. అంతేకానీ.. అలా మిక్స్‌ చేయబడిన పదార్థాలతో తయారు చేసిన పెరుగుకు కాదు.

కనుక రెస్టారెంట్లలో గడ్డ పెరుగును తినాలా, వద్దా ? అనేది ఎవరికి వారు సొంతంగా తీసుకోవాల్సిన నిర్ణయం. అయితే పెరుగును తినడం వల్ల లాభాలే కలుగుతాయి, నష్టం ఉండదు. కనుక ఎవరికి వారు నిర్ణయం తీసుకుని ఆ విధంగా పెరుగును తినవచ్చు.

Admin

Recent Posts