వినోదం

దేవ‌ర రెండు పార్ట్‌లు ఎందుకు తీశారంటే.. ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పిన ఎన్టీఆర్..!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన మాసివ్ యాక్షన్ ఎంటర్టైనర్ “దేవర చిత్రం సెప్టెంబ‌ర్ 27న విడుద‌ల కాగా, ఈ చిత్రం ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ సినిమా దాదాపు 5 ఏళ్ళు తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సోలో సినిమా సినిమా అని తెలిసిందే. ప్ర‌తి చోట దేవర సినిమాకి అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌స్తుంది. ఎన్టీఆర్ ప‌ర్‌ఫార్మెన్స్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇక ఎన్టీఆర్ ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ సంద‌ర్భంగా ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు. ఈ క్రమంలో ఓ వార్త నెట్టింట వైర‌ల్ అవుతుంది. దేవ‌ర సినిమాని రెండు పార్ట్‌లుగా ఎందుకు విభ‌జించారు అనే విష‌యం అంద‌రికి షాకిచ్చింది.

దేవ‌ర షూటింగ్‌ ప్రారంభించిన సమయంలోనే ఎన్టీఆర్‌ తో తాను రూపొందిస్తున్న దేవర సినిమాను రెండు పార్ట్‌ లుగా విభజిస్తున్నట్లుగా దర్శకుడు కొరటాల శివ ప్రకటించారు. ఆయన సినిమా కథ ను సింగిల్‌ పార్ట్‌ లో చెప్పడం సాధ్యం కావడం లేదని, అందుకే రెండు పార్ట్‌ లుగా తీసుకు వస్తే పూర్తి కథకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశ్యంతో అలా చేసినట్లు చెప్పుకొచ్చారు. దేవర రెండు పార్ట్‌ ల గురించి జూనియ‌ర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ… దేవర కథను శివ గారు చెప్పిన సమయంలోనే పాత్రలు చాలా అద్భుతంగా అనిపించాయి. ఆ పాత్రలన్నింటిని పూర్తిగా డెవలప్ చేయాలని చెప్పాను. ఆయన చాలా పాత్రలను ముందుగా అనుకున్న దానికంటే ఎక్కువ నిడివితో డెవెలప్‌ చేయడం జరిగింది.

why devara took 2 parts

ఆ పాత్రలతో స్క్రిప్ట్‌ ను రెడీ చేసి ఎడిటర్‌ శ్రీకర్ ప్రసాద్ గారికి ఇస్తే మొదటి పార్ట్‌ పూర్తి అవ్వక ముందే 5 గంటల నిడివి దాటిందని చెప్పారు. దాంతో మేము ఈ సినిమాను సింగిల్ పార్ట్‌ లో తీసుకు వస్తే అన్యాయం జరుగుతుందని అనుకున్నాము. అందుకే రెండు పార్ట్‌ లుగా సినిమాను తీసుకు రావాలని నిర్ణయించుకున్నాం. రెండు పార్ట్‌ ల్లోనూ మంచి కథ ను ఉంటుంది. ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా పాత్రలు ఉంటాయి, ప్రతి సన్నివేశం ను అద్భుతంగా శివ గారు రూపొందించారని ఎన్టీఆర్‌ చెప్పుకొచ్చారు. దేవర సినిమా మొదటి పార్ట్‌ హిట్ టాక్‌ దక్కించుకుంటే ఆలస్యం లేకుండా వచ్చే ఏడాదిలోనే సెకండ్‌ పార్ట్‌ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. . జాన్వీ కపూర్ హీరోయిన్‌ గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

Sam

Recent Posts