mythology

Kumbhkaran : కుంభ‌క‌ర్ణుడు ఆరు నెల‌లు ఎందుకు నిద్ర‌పోయేవాడో తెలుసా..?

Kumbhkaran : ఎవరైనా ఎక్కువ సేపు నిద్రపోతే కుంభకర్ణుడిలా పడుకుంటున్నావ‌ని చెప్తూ ఉంటారు. మీరు కూడా చాలా సార్లు వినే ఉంటారు. కుంభకర్ణుడు ఆరు నెలల పాటు నిద్రపోయేవాడ‌ని చెబుతారు. అయితే, అసలు ఎందుకు కుంభకర్ణుడు ఆరు నెలలు నిద్రపోయేవాడు..?, దాని వెనుక కారణం ఏమిటి..? ఏదైనా శాపం ఉందా లేదంటే ఎవరైనా వరం చేర్చారా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఒకటి, రెండు రోజులు నిద్రపోవడమే కష్టంగా ఉంటుంది. కానీ, కుంభకర్ణుడు ఏకంగా ఆరు నెలల పాటు నిద్రపోయేవాడు.

మన పురాణాల ప్రకారం చూసినట్లయితే కూడా కుంభకర్ణుడు ఆరు నెలలు నిజంగా నిద్ర పోయినట్లు ఉంది. కుంభకర్ణుడి పాత్ర కొంచెం విడ్డూరంగా ఉంటుంది. నమ్మలేని విధంగా అనిపిస్తూ ఉంటుంది. అయితే, కుంభకర్ణుడు ఎందుకు ఆరు నెలలు నిద్రపోయాడు అనే విషయానికి ఇప్పుడు వచ్చేద్దాం. కుంభకర్ణుడు రావణుడి సోదరుడు. కుంభకర్ణుడు పుట్టగానే దొరికిన జంతువులన్నింటినీ పట్టుకుని తినేస్తూ ఉండేవాడు.

why kumbh karan sleeps for 6 months

అప్పుడు దేవతల రాజు ఇంద్రుడు బాణాలు వేసి, కుంభకర్ణుడిని తరిమాడు. అయినా కూడా ఆయనే అతను చేష్టలకి భయపడవలసి వచ్చింది. కుంభకర్ణుడు రావణునితో వెళ్లి, బ్రహ్మ కోసం ఘోరమైన తపస్సు చేశాడు. రావణుడి కంటే ఎక్కువ తపస్సు చేయడంతో దేవతలు భయపడిపోయారు. బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్లారు. ఈ తపస్సు వల్ల కుంభకర్ణుడు ఏ విద్యను సాధిస్తాడు అని అందరూ ఆందోళన చెందారు. అందుకని బ్రహ్మని కాపాడాలని వేడుకున్నారు. బ్రహ్మ ఆజ్ఞ ప్రకారం సరస్వతి దేవి కుంభకర్ణుడు నాలుక మీద నిల్చుని ఆరు నెలలు నిద్ర, ఒక రోజు భోజనం కావాలని పలికించింది.

అలా బ్రహ్మ కుంభకర్ణుడు అడిగినట్లే వరమిచ్చాడు బ్ర‌హ్మ‌. కుంభకర్ణుడి కోసం ప్రత్యేక భవనం, ప్రత్యేక భోజన సౌకర్యం కల్పించారు. కుంభకర్ణుడు తీసే గురకకి అందరి చెవులు చిల్లులు పడేవి. కుంభకర్ణుడి నోటి నుండి వచ్చే గాలికి సైనికులు విసిరినట్లు పడిపోయేవారు. రావణ యుద్ధం సమయంలో కుంభకర్ణుడిని నిద్ర లేపడం ఎంతో కష్టమైంది. సినిమాలో ఈ సీన్లు మీరు చూసే ఉంటారు. అలాగే పురాణాల ప్రకారం ముందు శాపం ఉండ‌డం వలన కుంభకర్ణుడిగా అవతరించినట్లు శాస్త్రాలు చెబుతున్నాయి.

Admin

Recent Posts