lifestyle

Lalitha Jewellery Owner : ల‌లిత జ్యువెల్ల‌ర్స్ ఓన‌ర్ కిర‌ణ్ కుమార్ ఎల్ల‌ప్పుడూ గుండులోనే ద‌ర్శ‌న‌మిస్తారు.. ఎందుకో తెలుసా..?

Lalitha Jewellery Owner : టీవీల్లో మ‌న‌కు రోజూ అనేక ర‌కాల యాడ్స్ క‌నిపిస్తుంటాయి. అయితే వాటిల్లో కొన్ని యాడ్స్ మాత్రం మ‌న‌ల్ని అమితంగా ఆక‌ట్టుకుంటుంటాయి. వాటిల్లో లలిత జ్యువెల్ల‌ర్స్‌కు చెందిన యాడ్ కూడా ఒక‌టి. సాధార‌ణంగా ఏ కంపెనీ లేదా వ్యాపారం అయినా స‌రే సెల‌బ్రిటీలు, మోడ‌ల్స్‌ను పెట్టి యాడ్స్ తీస్తుంటారు. వాటినే ప్ర‌సారం చేస్తుంటారు. కానీ ల‌లిత జ్యువెల్ల‌ర్స్ కు మాత్రం స్వ‌యంగా య‌జ‌మానే యాడ్స్‌లో క‌నిపిస్తుంటారు. వాస్త‌వానికి ఈ ట్రిక్ బాగానే ప‌నిచేసింది. సూటిగా సుత్తి లేకుండా తాము అందించే సేవ‌ల‌ను ఆయ‌న స్వ‌యంగా ప్ర‌చారం చేస్తున్నారు. దీంతో ల‌లిత జ్యువెల్ల‌ర్స్‌కు మంచి పేరు వ‌చ్చింది.

ల‌లిత జ్యువెల్ల‌ర్స్ అన‌గానే మ‌నకు ముందుగా గుండులో ఉన్న ఆ సంస్థ య‌జ‌మాని కిర‌ణ్ కుమార్‌ గుర్తుకు వ‌స్తారు. అంత‌లా ఈ సంస్థ పాపుల‌ర్ అయింది. టీవీల్లో యాడ్స్‌లో క‌నిపిస్తూ.. న‌గ‌ల‌ను కంపార్ చేయ‌మ‌ని, అలాగే డ‌బ్బులు ఊరికే రావ‌ని ఆయ‌న చెబుతుంటారు. అవే డైలాగ్స్ చాలా ఫేమ‌స్ అయ్యాయి. వాటిని చాలా మంది అనుక‌రిస్తుంటారు కూడా. అయితే కిర‌ణ్ కుమార్ ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించారు.

why lalitha jewelry owner kiran kumar always appears in bald head

ల‌లిత జ్యువెల్ల‌ర్స్‌కు దేశ‌వ్యాప్తంగా 300కు పైగా స్టోర్స్ ఉండ‌గా.. 30వేల మందికి పైగా ఉద్యోగులు ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. ఏడాదికి రూ.10వేల కోట్ల ట‌ర్నోవ‌ర్ ఉంటుంద‌ని.. రూ.300 కోట్ల ట్యాక్స్ క‌డుతున్నామ‌ని అన్నారు. ఇక మీరు ఎప్పుడూ గుండులోనే ఎందుకు క‌నిపిస్తారు.. అని ప్ర‌శ్నించ‌గా.. తాను 18 ఏళ్ల కింద‌ట ఒక‌సారి తిరుప‌తి వెళ్లి అక్క‌డ గుండు చేయించుకున్నాన‌ని.. అయితే అంత‌కు ముందు త‌న‌కు కూడా అంద‌రికీ ఉన్న‌ట్లే చాలా జుట్టు ఉండేద‌ని.. అప్పుడు త‌న‌ను ఎవ‌రూ పొగ‌డ‌లేద‌ని.. కానీ గుండు చేయించుకున్న త‌రువాత త‌న లుక్ బాగుంద‌ని చాలా మంది కితాబు ఇచ్చార‌ని అన్నారు. అయితే జుట్టు ఉన్న‌ప్పుడూ ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు కానీ.. గుండు చేయించుకున్నాకే తాను బాగున్నాన‌ని అంద‌రూ చెప్పార‌ని.. అందుక‌నే ఆ లుక్‌నే ఇప్ప‌టికీ కంటిన్యూ చేస్తున్నాన‌ని.. త‌న గుండు వెనుక ఉన్న అస‌లు విష‌యాన్ని ఆయ‌న చెప్పారు. దీంతో ఆయ‌న కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి.

Admin

Recent Posts